Strict action will be taken if there is no quality in the work. పనుల్లో నాణ్యత లేకపోతే కఠిన చర్యలు
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:07 AM
Strict action will be taken if there is no quality in the work. అభివృద్ధి పనుల్లో నాణ్యత లేకపోతే కఠిన చర్యలు తప్పవని దక్షిణ కోస్తారైల్వే జనరల్ మేనేజర్ సందీప్‌మాథూర్ స్పష్టంచేశారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాక మొదటిసారిగా జీఎం కొత్తవలస రైల్వే స్టేషన్‌ను గురువారం సందర్శించారు. రూ.12 కోట్లతో అమృత్ భారత్ రైల్వేస్టేషన్ పథకంలో రూపుదిద్దుకుంటున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.
పనుల్లో నాణ్యత లేకపోతే కఠిన చర్యలు
దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్
కొత్తవలస, జూన్ 4(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనుల్లో నాణ్యత లేకపోతే కఠిన చర్యలు తప్పవని దక్షిణ కోస్తారైల్వే జనరల్ మేనేజర్ సందీప్‌మాథూర్ స్పష్టంచేశారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాక మొదటిసారిగా జీఎం కొత్తవలస రైల్వే స్టేషన్‌ను గురువారం సందర్శించారు. రూ.12 కోట్లతో అమృత్ భారత్ రైల్వేస్టేషన్ పథకంలో రూపుదిద్దుకుంటున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ప్లాట్‌ఫారాలపై వేసిన టైల్స్‌లో నాణ్యత లోపించిన విషయాన్ని గుర్తించి వాటిని వెంటనే మార్పు చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల విషయంలో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టేషన్‌లో నూతనంగా చేపడుతున్న ప్రతి పనిని నిశితంగా పరిశీలించి అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. గతంలో కొత్తవలస రైల్వే స్టేషన్‌లో నిలుపుదల చేసిన రాయగడ ప్యాసింజర్, కోర్బా ఎక్స్ ప్రెస్ వంటికొన్ని రైళ్ల హాల్టులను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరారు. చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. అలాగే రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట విశాఖ డివిజనల్ మేనేజర్ లలిత్‌బోహ్రా, రైల్వేశాఖకు చెందిన పలువురు అధికారులు ఉన్నారు.