Share News

లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు

ABN , Publish Date - Jul 16 , 2026 | 12:36 AM

లింగ నిర్ధారణకు పాల్పడే స్కానింగ్‌ కేంద్రాలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో ఎస్‌.జీవనరాణి హెచ్చరించారు.

లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు

  • డీఎంహెచ్‌వో జీవనరాణి

విజయనగరం, రింగురోడ్డు, జూలై 15(ఆంధ్రజ్యోతి): లింగ నిర్ధారణకు పాల్పడే స్కానింగ్‌ కేంద్రాలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో ఎస్‌.జీవనరాణి హెచ్చరించారు. బుధవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యా లయంలో జిల్లా, ఉప జిల్లా స్థాయి అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి స్కానింగ్‌ కేంద్రం వద్ద 18002332447 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. అదేవిధంగా పరీక్షల వివరాలను ఫామ్‌-ఎఫ్‌లో నమోదు చేసి ప్రతినెల 2వ తేదీ లోపు కార్యాల యానికి సమర్పించాలన్నారు. జిల్లాలో మొత్తం 128 స్కానింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, వీటిలో 19 ప్రభుత్వ, 109 ప్రైవేటుకు ఉన్నాయన్నారు. నిర్ణీత గడువులోగా ఈ కేంద్రా లు రెన్యువల్‌ చేయించుకోకపోతే వీటి రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. నోడల్‌ అధికారి అచ్యుతకుమారి, స్త్రీ వ్యాధి నిపుణులు మానస, జిల్లా పంచాయతీ అధికారి టి.ఫృథ్వీ, ఏపీఆర్‌వో సీహెచ్‌ ప్రభుదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2026 | 12:36 AM