Share News

Strict Action ఒక్క మరణం సంభవించినా చర్యలు

ABN , Publish Date - Jun 27 , 2026 | 11:45 PM

Strict Action if Even One Death Occurs సీజనల్‌ వ్యాధులపై వైద్య సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు. ఎక్కడైనా అకారణంగా ఒక్క మరణం సంభవించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం సాలూరు పట్టణంలో ఏరియా ఆసుపత్రిని సందర్శించారు.

Strict Action ఒక్క మరణం సంభవించినా చర్యలు
జిల్లా వైద్యాధికారులతో మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

  • సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం

  • ఆసుపత్రుల్లో రోగులకు మంచాలు ఉండాలి

సాలూరు, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): సీజనల్‌ వ్యాధులపై వైద్య సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు. ఎక్కడైనా అకారణంగా ఒక్క మరణం సంభవించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం సాలూరు పట్టణంలో ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. వైద్యం సక్రమంగా అందుతుందా? లేదా? అని వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య సిబ్బందితో ఆమె మాట్లాడుతూ.. ఆసుపత్రి నిధులతో ఈ ఏడాది పూర్తిస్థాయిలో మంచాలు కొనుగోలు చేయాలన్నారు. రోగులకు సరిపడా మందులు ఉండాలని, రెఫరల్స్‌ను తగ్గించాలని సూచించారు. ఏ గ్రామంలోనైనా ఇద్దరు లేదా ముగ్గురు జ్వరాలతో బాధపడుతున్నట్లు తెలిస్తే.. వెంటనే ఆ ప్రాంతంలో మెడికల్‌ క్యాంపు నిర్వహించాలని ఆదేశించారు. జూలై 10న ఆసుపత్రిలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించాలని సూచించారు. ఈ పరిశీలనలో డీఎంహెచ్‌వో భాస్కరరావు, జిల్లా వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 11:45 PM