Betting బెట్టింగ్‌లకు దిగితే కఠిన చర్యలు
ABN , Publish Date - Apr 01 , 2026 | 11:42 PM
Strict Action Against Those Engaging in Betting ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా బెట్టింగ్‌లకు దిగితే కఠిన చర్యలు తప్పని ఎస్పీ మాధవరెడ్డి హెచ్చరించారు. బుధవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... జిల్లా యువత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లతో జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు.
బెలగాం, ఏప్రిల్1(ఆంధ్రజ్యోతి) : ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా బెట్టింగ్‌లకు దిగితే కఠిన చర్యలు తప్పని ఎస్పీ మాధవరెడ్డి హెచ్చరించారు. బుధవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... జిల్లా యువత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లతో జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. కొంతమంది స్వార్థపరులు ఆశచూపి క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు చేసే అవకాశం ఉందని, అటువంటి వారికి దూరంగా ఉండాలని హితవు పలికారు. ఆన్‌లైన్‌లో గాని, ఆఫ్‌లైన్‌లో గాని బెట్టింగ్ జోలికి వెళ్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.