Strict Action మోసాలకు పాల్పడితే చర్యలు
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:41 PM
Strict Action Against Fraud వ్యాపారులు మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా తూనిక కొలతల శాఖాధికారి కె.రతన్‌రాజ్ హెచ్చరించారు. బుధవారం గుమ్మలక్ష్మీపురం, ఎల్విన్‌పేట గ్రామాల్లోని పలు షాపులను పరిశీలించారు.
గుమ్మలక్ష్మీపురం, జనవరి7(ఆంధ్రజ్యోతి): వ్యాపారులు మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా తూనిక కొలతల శాఖాధికారి కె.రతన్‌రాజ్ హెచ్చరించారు. బుధవారం గుమ్మలక్ష్మీపురం, ఎల్విన్‌పేట గ్రామాల్లోని పలు షాపులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుకాణాల్లో కాటాలకు తప్పనిసరిగా సీలు వేయించుకోవాలన్నారు. వస్తువులను సరిగా తూసి వినియోగదారులకు ఇవ్వాలని తెలిపారు. మోసాలకు గురైనట్లు వినియోగదారులు భావిస్తే ఫోరాన్ని ఆశ్రయించొచ్చన్నారు. ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని సూచించారు. కాగా గుమ్మలక్ష్మీపురంలో 12 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. అనంతరం గుమ్మలక్ష్మీపురంలోని వారపు సంతల్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఆయన వెంట జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం ఇన్‌చార్జి పట్నాయక్ నాగమణి, వినియోగదారుల కో-ఆర్డినేటర్ పి.చైతన్య, తూనిక కొలతల శాఖ సిబ్బంది బాషా, ఆనంద్, ప్రసాద్ తదితరులు ఉన్నారు.