‘బీజేపీని బలోపేతం చేయండి’
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:28 AM
బీజేపీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృష చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌వర్మ పిలుపు నిచ్చారు.
రామభద్రపురం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): బీజేపీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృష చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌వర్మ పిలుపు నిచ్చారు. మండల కేంద్రంలో శుక్రవారం పండిట్ దీనదయాళ్ ఉపాధ్యా య ప్రశిక్షణ మహా అభియాన్ నిర్వహించారు. మండల అధ్యక్షురాలు మూడడ్ల ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రయంలో ఆయన మాట్లాడారు. బీజేపీ సిద్ధాంతాలకు అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. దేశ రక్షణే మొదటి కర్తవ్యంగా భావించి ప్రధాని ఎన్నో కార్యక్రమాలు విజయ వంతం చేస్తున్నారన్నారు. భారతదేశాన్ని ప్రపంచలోనే అగ్రరాజ్యంగా తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. ఇటువంటి తరుణంలో ప్రజలంతా ఆయనకు మద్దతు తెలపాలని కోరారు. అలాగే మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో ప్రోక్రాన్ అణుబాంబులను తయారు చేయించి దేశాన్ని సుస్థిర స్థానంలో నిలబెట్టిన ఘనత ఆయన కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ మే ధ్యేయంగా పాలిస్తుందని కితాబిచ్చారు. ఈసందర్భంగా భారతీయ జనతా పార్టీ స్థాపించిన శ్యామ్ ముఖర్జీ దీనదయాళ్ ఉపాధ్యాయ సేవల ను ఈ సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్య దర్శి వేమకొటి గిరిబాబు, బీజేపీ సీనియర్ నాయకులు పెంట స్వావి నాయుడు, చెలికాని కేశవ, బాదంపూడి రామనాగలింగేశ్వర శర్మ, తాడ్డి ఈశ్వరరావు, తాడుతూరి వెంకటరావు, ఆచారి పాల్గొన్నారు.