మహిళా ఆర్థిక సాధికారతకు ‘స్త్రీ శక్తి’
ABN , Publish Date - Aug 16 , 2026 | 12:19 AM
రాష్ట్రంలో మహి ళల ఆర్థిక సాధికారతకు స్త్రీ శక్తి పథకం కొత్త అర్థాన్ని తీసుకుకొచ్చిందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ అన్నారు.
రాజాం, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహి ళల ఆర్థిక సాధికారతకు స్త్రీ శక్తి పథకం కొత్త అర్థాన్ని తీసుకుకొచ్చిందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ అన్నారు. ఈసందర్భంగా ఆయన రాజాంలో ఆర్టీసీ బస్సు ఎక్కి.. బస్సులో ప్రయాణి స్తున్న మహిళలతో మాట్లాడారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై వారిని అడిగి తెలుసుకున్నారు. మహిళ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
‘స్త్రీ శక్తి’ విజయవంతం
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు శ్రీదేవి
గజపతినగరం, ఆగస్టు 15(ఆంధ్రజ్యో తి): కూటమి ప్రభు త్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం విజయ వంతంగా నడుస్తుంద ని టీడీపీ పొలిట్‌బ్యూ రో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి అన్నారు. శనివారం ఆమె ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మహిళలను కలిసి, పథకం ద్వారా వారికి కలుగుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక టీడీపీ కార్యాలయంలో పలువురు మహిళలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మక్కువ శ్రీధర్, పార్టీ నాయకులు కొండపల్లి కొండలరావు, ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, గంట్యాడ, దత్తిరాజేరు మండలాల పార్టీ అధ్యక్షు లు కొండపల్లి భాస్కరనాయుడు, చప్పా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.