Share News

Dog పిచ్చికుక్క స్వైరవిహారం

ABN , Publish Date - May 28 , 2026 | 12:33 AM

Stray Dog on the Rampage పాలకొండ పట్టణంలోని ఓ పిచ్చికుక్క బుధవారం స్వైర విహారం చేసింది. పలువురిపై దాడి చేసింది. ప్రధానంగా జెట్టివారివీధి, బల్లంకివారి వీధి, గెటాలడెప్పి వీధి, లోగిడి వీధి ఇతర ప్రాంతాల్లో దాదాపు 15 మందిపై దాడిచేసి గాయపరిచింది.

 Dog   పిచ్చికుక్క  స్వైరవిహారం
పాలకొండ ఏరియా ఆసుప త్రిలో కుక్కకాటు బాధితులు

పాలకొండ, మే27(ఆంధ్రజ్యోతి): పాలకొండ పట్టణంలోని ఓ పిచ్చికుక్క బుధవారం స్వైర విహారం చేసింది. పలువురిపై దాడి చేసింది. ప్రధానంగా జెట్టివారివీధి, బల్లంకివారి వీధి, గెటాలడెప్పి వీధి, లోగిడి వీధి ఇతర ప్రాంతాల్లో దాదాపు 15 మందిపై దాడిచేసి గాయపరిచింది. కుక్క కాటుకు గురైన వారిలో చిన్నారులు, మహిళలు, పురుషులు ఉన్నారు. ప్రస్తుతం పాలకొండ ఏరియా ఆసుపత్రికి చేరిన బాధితులకు వైద్య సిబ్బంది ర్యాబిస్‌ వ్యాక్సిన్‌ వేశారు. కాగా పిచ్చికుక్క పట్ణణంలో ఇంకెంతమందిపై దాడి చేస్తుందో తెలియని పరిస్థితి ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నగర పంచాయతీ పరిధిలో వీధి కుక్కల సమస్య పరిష్కరించాలని గతంలో అధికారులకు విన్నవించినా.. ఎవరూ పట్టించుకోవడంపై పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై నగర పంచాయతీ కమిషనర్‌ రత్నరాజును వివరణ కోరగా.. దాడి చేసిన కుక్కను గుర్తించి బంధిస్తామని వెల్లడించారు.

Updated Date - May 28 , 2026 | 12:34 AM