Stop False Information అసత్య ప్రచారం మానండి
ABN , Publish Date - Aug 12 , 2026 | 12:32 AM
Stop Spreading False Information మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని మానుకోవాలని లేకుంటే భవిష్యత్‌లో తగిన గుణపాఠం తప్పదని నూతన డీఎస్సీ ఉపాధ్యాయులు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వానికి మద్దతుగా మంగళవారం సుమారు 50 మంది టీచర్లు సాలూరులో ర్యాలీ నిర్వహించారు.
కూటమికి మద్దతుగా సాలూరులో ర్యాలీ
సాలూరు, ఆగస్టు11(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని మానుకోవాలని లేకుంటే భవిష్యత్‌లో తగిన గుణపాఠం తప్పదని నూతన డీఎస్సీ ఉపాధ్యాయులు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వానికి మద్దతుగా మంగళవారం సుమారు 50 మంది టీచర్లు సాలూరులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ నిర్వహణలో అవకతవకలు జరిగాయని, సీబీఐ విచారణ జరపాలని వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. తాము సంవత్సరాల తరబడి కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించామన్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించిందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించని జగన్.. ఇప్పుడు మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉపాధ్యాయ కుటుంబాలను మానసిక క్షోభకు గురిచేయడం తగదన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలన్నారు.