Share News

FPOs ఎఫ్‌పీవోల బలోపేతానికి చర్యలు

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:31 PM

Steps to Strengthen FPOs రైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్‌పీవోలు) బలోపేతానికి చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం పక్కా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. చిన్న, సన్నకారు రైతులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.

  FPOs ఎఫ్‌పీవోల బలోపేతానికి చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, జూలై14(ఆంధ్రజ్యోతి): రైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్‌పీవోలు) బలోపేతానికి చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం పక్కా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. చిన్న, సన్నకారు రైతులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోల్ట్‌స్టోరేజ్‌లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం అందిస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలు, రుణాలపై రైతులకు అవగాహన కల్పించడం కోసం తెలుగులో ప్రత్యేక చెక్‌లిస్ట్‌ రూపొందించాలని సూచించారు. జిల్లాలోని 15 ఎఫ్‌పీవోల్లో 30 వేలకు పైగా రైతులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. నాబార్డు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా లభించే రాయితీలు, రుణాలను వారికి అందించాలని ఆదేశించారు. ఎఫ్‌పీవో ఫెడరేషన్‌కు డీసీవో ఎం.వాణిశైలజను నోడల్‌ అధికారిగా నియమించగా, శిక్షణ బాధ్యతలను డీఆర్‌డీఏ పీడీ ప్రభావతికి అప్పగించారు. అనంతరం నాబార్డు డీడీ దినేష్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు అందజేయనున్న పలు లోన్స్‌, అందుకు కావాల్సిన పలు అంశాలు వివరించారు.

Updated Date - Jul 14 , 2026 | 11:31 PM