Share News

Water Resources జల వనరుల పరిరక్షణకు చర్యలు

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:14 AM

Steps to Protect Water Resources జిల్లాలో జలవనరులు, చెరువు గర్భాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ వైశాలి ఆదేశించారు. శనివారం తన చాంబర్‌లో జిల్లా స్థాయి పరిరక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

 Water Resources జల వనరుల పరిరక్షణకు  చర్యలు
సిబ్బందికి సూచనలిస్తున్న ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ వైశాలి

పార్వతీపురం, జూలై 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జలవనరులు, చెరువు గర్భాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ వైశాలి ఆదేశించారు. శనివారం తన చాంబర్‌లో జిల్లా స్థాయి పరిరక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రధాన నీటి వనరులు, చెరువులు, కుంటుల పరిధిని స్పష్టంగా గుర్తించి వాటి సరిహద్దులను కాపాడడం కమిటీ ప్రాథమిక బాధ్యతని స్పష్టం చేశారు. చెరువులు, కాలువుల, నీటి నిల్వ ప్రాంతాల్లో ఇప్పటికే జరిగిన ఆక్రమణలను గుర్తించి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. తక్షణమే ఆక్రమణలను తొలగించాలన్నారు. ఆక్రమణలను ముందస్తుగానే అడ్డుకునేందుకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ, నీటిపారుదల, స్థానిక సంస్థల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నీటి వనరులను పూడ్చివేసినా లేదా అనధికారికంగా నిర్మాణాలు చేపట్టినా మైనింగ్‌, రెవెన్యూ చట్టాల ప్రకారం క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు.

సర్‌ ప్రక్రియ పరిశీలన

సాలూరు: కొత్తవలస, పాచిపెంట, మిర్తివలస పోలింగ్‌ కేంద్రాలను ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి శనివారం పరిశీలించారు. సర్‌ ప్రక్రియపై ఆరా తీశాఆరు. ఫారాల పంపిణీ, సేకరణతోపాటు, డిజిటలైజేషన్‌ తదితర అంశాలను బీఎల్‌వోలను అడిగి తెలుసుకున్నారు. పారపాట్లు లేకుండా డేటా ఎంట్రీ జరగాలని సూచించారు. ఇంటింటా సర్వే చేసైనా లక్ష్యాలు సాధించాలని, సూపర్‌వైజర్లు అందుబాటులో ఉంటూ బీఎల్‌వోలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.

Updated Date - Jul 05 , 2026 | 12:14 AM