Healthcare అందరికీ వైద్య సేవలు చేరువయ్యేలా చర్యలు
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:38 PM
Steps to Bring Healthcare Within Everyone's Reach ‘మన్యం వీడియో డాక్టర్ సేవలు’ పేరిట జిల్లాలో త్వరలో మల్టీ స్పెషాలిటీ స్వరీసును అందుబాటులోకి తీసుకురానున్నట్లు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా సరికొత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
అందుబాటులోకి మల్టీ స్పెషాలిటీ సర్వీసులు
కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పార్వతీపురం టౌన్, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి) : ‘మన్యం వీడియో డాక్టర్ సేవలు’ పేరిట జిల్లాలో త్వరలో మల్టీ స్పెషాలిటీ స్వరీసును అందుబాటులోకి తీసుకురానున్నట్లు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా సరికొత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య నిపుణుల సేవలు అందరికీ చేరువయ్యేలా చర్యలు చేపడతా మన్నారు. బుధ వారం కలెక్టరేట్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వైద్య ఆరోగ్యశాఖాధికా రులతో సమీక్షించారు. విద్యార్థులు, ప్రజలకు సత్వరమే చికిత్స అందేలా ‘మన్యం వీడియో డాక్టర్’ పేరిట ఎంఎంఎస్‌ఎస్ వైద్య నిపుణుల సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. దీనివల్ల మారుమూల పల్లెలు, గిరిశిఖర గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. విద్యార్థులు కూడా ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్పెషలిస్టు వైద్య సేవలు అందిస్తామన్నారు. సమీప ఆరోగ్య కేంద్రాలు, హెల్త్‌వెల్నెస్ సెంటర్లలో ఆన్‌లైన్ వీడియోలోని వైద్య నిపుణులతో రోగులు నేరుగా మాట్లాడి ఆరోగ్య సమస్యలను తెలియజేయొచ్చన్నారు. కాగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి ‘మన్యం’లో ఆదివాసీ దినోత్సవాన్ని ప్రారంభిస్తారన్నారు. ఈ జూమ్ సమావేశంలో డీఎంహెచ్‌వో పి.విజయలక్ష్మి, డీసీహెచ్‌ఎస్ జి.నాగభూషణరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు పద్మావతి, కె.విజయపార్వతి తదితరులు పాల్గొన్నారు.
వరి, చేపల మిశ్రమ పెంపకంతో అధికాదాయం
పాలకొండ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): తక్కువ నీటి వనరులతో అధిక ఆదాయం పొందేందకు వరి, చేపల మిశ్రమ పెంపకం ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో తొలిసారిగా చేపట్టిన వరి, చేపల మిశ్రమ పెంపకాన్ని బుధవారం పనుకువలస, తలవరం పరిధిలోని వ్యవసాయ క్షేత్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వరి పొలంలోని కాలువలో సుమారు 350 చేప పిల్లలను వదిలారు. ఎల్‌నినో ప్రభావం, నీటి కొరత పరిస్థితుల్లో రైతులకు స్థిరమైన ఆదాయం అందించేందుకు ఈ సమగ్ర వ్యవసాయ విధానం దోహదపడు తుందని తెలిపారు. ఒకే వనరుతో వరి పంటతో పాటు చేపల దిగుబడి పొందొచ్చన్నారు. దీని ద్వారా ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఏవో టి.భవానీ శంకర్, జిల్లా మత్స్యశాఖ అధికారి టి.సంతోష్‌కుమార్, ఏపీసీఎన్‌ఎఫ్ డీపీఎం ఎం.షన్ముఖనాయుడు, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.