గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు
ABN , Publish Date - Apr 13 , 2026 | 12:11 AM
విజయనగరం జి ల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చి దిద్దేందుకు పోలీ సు యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తోందని ఎస్పీ ఏఆ ర్ దామోదర్ తెలిపారు.
ఎస్పీ దామోదర్
పోలీస్‌స్టేషన్ల ఆకస్మిక తనిఖీ
బొబ్బిలి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): విజయనగరం జి ల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చి దిద్దేందుకు పోలీ సు యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తోందని ఎస్పీ ఏఆ ర్ దామోదర్ తెలిపారు. బొబ్బిలి పోలీసుస్టేషన్‌ను, రూ రల్ సర్కిల్ కార్యాలయాన్ని ఆయన ఆదివారం సంద ర్శించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఒడిశా నుంచి గంజాయి రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. సంక ల్పం పేరుతో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమా లు చేపడుతున్నామని తెలిపారు. సీఐలు కింతలి నారా యణరావు, శ్రీనివాసరావు, ఎస్‌ఐ జ్ఞానప్రసాద్ తదితరు లు పాల్గొన్నారు.
బొబ్బిలి కోట సందర్శన
బొబ్బిలి కోటను ఎస్పీ ఏఆర్ దామోదర్ తమ కు టుంబ సభ్యులతో ఆదివారం సందర్శించారు. ఎమ్మెల్యే బేబీనాయన వారికి సాదరంగా స్వాగతం పలికారు. దర్బార్ మహల్‌ను, అక్కడ మ్యూజియంను ఎస్పీ ఆసక్తి గా తిలకించారు. ఆనాటి ఆయుధాలను, ఫొటోలకు సం బంధించి ఎమ్మెల్యే వారికి వివరించారు. అనంతరం బొబ్బిలి వీణను బహూకరించి సత్క రించారు. బొబ్బిలి కోటను సందర్శిం చిన అనంతరం ఎస్పీ స్పందిస్తూ అక్కడ రికార్డుల్లో తన అభిప్రాయాన్ని ఇలా నమోదు చేశారు. ‘బొబ్బిలి కోట పౌరుషాలకు, ఆత్మాభిమానానికి ప్రతీక. అలాంటి కోటను దర్శించడం నా అదృష్టం. గొప్ప అవకాశం. బొబ్బిలి రాజులు ఉపయోగించిన ఆయుధాలు, వస్తువులు, వివిధ కాన్ఫరెన్స్‌ల్లో పాల్గొన్న ఫోటోలు మొదలగు వాటిని భద్రపరిచి ప్రజాదర్శనార్థం ఉంచిన నేటితరం బొబ్బిలి రాజుల ఆశయం చాలా గొప్పది. రియల్టీ ఇట్ ఈజ్ ఏ మార్వ్‌లెస్ ఆన్‌ది ఎర్త్ ఆఫ్ విజయనగరం డిస్ర్టిక్ట్’ అని ఎస్పీ రాశారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
రామభద్రపురం, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సైబర్ క్రైం ఎక్కువవుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆదివారం తనిఖీ చేశా రు. సైబర్ క్రైంను నిరోధించడానికి జిల్లా స్థాయిలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు చేశామని, వారిపై నిఘా కూడా పెడుతున్నామని తెలిపారు. అలాగే బెట్టింగ్ రాయళ్లపై కూడా నిఘా పెట్టామని, బెట్టింగ్ నిర్వాహ కులపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించా రు. ఈ సమావేశంలో బొబ్బిలి టౌన్ సీఐ కింతలి నా రాయణరావు, బొబ్బిలి రూరల్ సీఐ ఎస్.శ్రీనివాస్, ఎస్ ఐ జ్ఞానప్రసాద్ పాల్గొన్నారు.
దత్తిరాజేరు, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని స్టేషన్ బూర్జవలస పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదివారం తని ఖీ చేశారు. ఈసందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. ఫిర్యాదు దారులతో మర్యా దపూర్వకంగా నడుచుకోవాలన్నారు. సీఐ వెంకటర మణ, ఏఎస్‌ఐ రమణ పాల్గొన్నారు.