వీధి దీపాల ఏర్పాటుకు చర్యలు: కమిషనర్
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:12 AM
మునిసిపాలిటీ పరిధిలోగల కొత్తవలసలో వీధిదీపాలు ఏర్పాటుచేసి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఎ.రామచంద్రరావు హామీ ఇచ్చారు. బుధవారం కొత్తవలసలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
రాజాం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ పరిధిలోగల కొత్తవలసలో వీధిదీపాలు ఏర్పాటుచేసి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఎ.రామచంద్రరావు హామీ ఇచ్చారు. బుధవారం కొత్తవలసలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చీకటిపడిన తర్వాత ప్రజలు ఇబ్బందిపడుతుండడంతో స్తంభాలు వేయించి వీధివీపాలు ఏర్పాటుచే యాలని టీడీపీ నాయకులు శిమ్మ జగన్నాఽథం తదితరులు కోరారు. కాలువలు, సిమెంట్ రోడ్లు ఏర్పాటుకు అవసర మైన నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. ఇళ్లు నిర్మాణం చేపట్టి బిల్లులు రానివారు ఉంటే వివరాలు తెలియజేయాలని కోరారు.