Share News

Steps Taken to Expedite Resurvey రీసర్వే వేగవంతానికి చర్యలు

ABN , Publish Date - Aug 03 , 2026 | 11:52 PM

Steps Taken to Expedite Resurvey జిల్లాలో భూముల రీ సర్వే వేగవంతానికి చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో తహసీల్దార్లతో సమీక్షించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంతో పాటు భూ రీసర్వే ప్రక్రియకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

Steps Taken to Expedite Resurvey రీసర్వే వేగవంతానికి చర్యలు
అధికారులతో సమీక్షిస్తున్న ఇన్‌చార్జి జేసీ వైశాలి

పార్వతీపురం, ఆగస్టు3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూముల రీ సర్వే వేగవంతానికి చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో తహసీల్దార్లతో సమీక్షించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంతో పాటు భూ రీసర్వే ప్రక్రియకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహించరాదన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడవులో పనులు పూర్తి చేయాలని సూచించారు. పీజీఆర్‌ఎస్‌ అర్జీలు పెండింగ్‌ంలో లేకుండా చూడాలన్నారు. సరిహద్దు వివాదాలు, రెవెన్యూ రికార్డుల దిద్దుబాట్లుపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పాలకొండ సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, ఆర్డీవో మాధురి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం

బెలగాం: సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేలా తక్కువ ధరకే ప్రభుత్వం నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తోందని ఇన్‌చార్జి జేసీ వైశాలి తెలిపారు. పట్టణంలో రైతు బజార్లు, రైస్‌మిల్లుల అవుల్‌ లెట్‌ స్టోర్లలో సోమవారం బియ్యం విక్రయ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ ప్రత్యేక కౌంటర్‌ ద్వారా స్టీమ్‌ బియ్యం కిలో రూ.52, రా బియ్యం రూ.50కు విక్రయిస్తున్నట్టు తెలిపారు. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా రైస్‌మిల్లర్ల భాగస్వామ్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని వెల్లడించారు. మార్కెట్‌లో ధరలను నియంత్రించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యంగా సర్కారు పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2026 | 11:52 PM