Share News

భూములు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:04 AM

భోగా పురం, నందిగాం రైతుల భూములు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు కోరారు.ఈ మేరకు భోగాపురం, నందిగాంలో వ్యవసాయ భూములపై ఆధారపడి జీవిస్తున్నామని, భూములు తీసుకోకుండా కాపాడాలని కోరారు.

 భూములు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి
మంత్రి అనితకు వినతిపత్రం అందిస్తున్న బంగార్రాజు, రైతులు:

భోగాపురం, ఫిబ్ర వరి11(ఆంధ్రజ్యోతి): భోగా పురం, నందిగాం రైతుల భూములు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు కోరారు.ఈ మేరకు భోగాపురం, నందిగాంలో వ్యవసాయ భూములపై ఆధారపడి జీవిస్తున్నామని, భూములు తీసుకోకుండా కాపాడాలని కోరారు.ఈ మేరకు ఆయా గ్రామాల రైతులతో కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర సచివాలయంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వంగలపూడి అనిత, రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి కొడపల్లిశ్రీనివాస్‌లను కలిసి సమస్య వివరించి వినతిపత్రాలు అందజేశారు. అలాగే నియోజకవర్గానికి సంబందించిన పలు కీలక అభివృద్ధి అంశాలు, ప్రజా సమస్యలను బంగార్రాజు మంత్రులకు వివరించారు. కార్యక్రమంలో రైతులు కొమ్మూరుసుభోషణరావు, పల్లారాం బాబు, మాతా నవీన్‌, పడాలశ్రీనివాసరావు, బొడ్డహరిబాబు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 12:04 AM