పరిశ్రమలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - May 02 , 2026 | 12:13 AM
జిల్లా కు మంజూరైన పరిశ్రమలను వేగంగా పూర్తి చేయుట కు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి అన్నారు.
కలెక్టర్ రామసుందర్ రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, మే 1(ఆంధ్రజ్యోతి): జిల్లా కు మంజూరైన పరిశ్రమలను వేగంగా పూర్తి చేయుట కు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం సమా వేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, పరిశ్రమలశాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆ యన మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ, పుడ్ పార్క్, వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఎంవోయూలను త్వరగా పూ ర్తి చేయాలన్నారు. రాజాం, చీపురుపల్లిలో ఏపీఐఐసీ పా ర్కుల ఏర్పాటుకు భూ సేకరణ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.
మత్తు పదార్థాల నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్
జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టరు ఆదేశించారు. శుక్రవారం ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీటి నిర్మూలనకు 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగాన్ని, రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టాలన్నారు. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిం చాలని సూచించారు. చెక్ పోస్టులలో విస్తృత తనిఖీల కారణంగా రోడ్డు మార్గాల్లో గంజాయి రవాణా కొంత వరకు అరికట్టామని, రైలు రవాణాపై కూడా దృష్టి పెట్టాలని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ప్రవర్తనను ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని సూచించారు. కార్యక్రమంలోని జేసీ సేతుమాధవన్, ఏఎస్పీ సౌమ్య లత పాల్గొన్నారు.