Share News

RUBs ఆర్‌యూబీల నిర్మాణానికి చర్యలు

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:24 PM

Steps Initiated for Construction of RUBs జిల్లాలో ఆర్‌వోయూల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వాల్తేరు రైల్వే డీఆర్‌ఎం లలిత్‌ బొహ్రా అన్నారు. శనివారం పార్వతీపురం (బెలగాం) రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. ఆధునికీకరణలో భాగంగా చేపడుతున్న టికెట్‌ కౌంటర్‌, ప్రయాణికుల వసతి గదులు, రైల్వే గేట్‌ తదితర పనులను పరిశీలించారు.

  RUBs ఆర్‌యూబీల నిర్మాణానికి చర్యలు
డీఆర్‌ఎంతో మాట్లాడుత్ను ఎమ్మెల్యే

బెలగాం/సీతానగరం, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆర్‌వోయూల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వాల్తేరు రైల్వే డీఆర్‌ఎం లలిత్‌ బొహ్రా అన్నారు. శనివారం పార్వతీపురం (బెలగాం) రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. ఆధునికీకరణలో భాగంగా చేపడుతున్న టికెట్‌ కౌంటర్‌, ప్రయాణికుల వసతి గదులు, రైల్వే గేట్‌ తదితర పనులను పరిశీలించారు. అమృత భారత్‌ కింద రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. అన్ని ఆధునిక వసతులు కల్పిస్తామని తెలిపారు. బెలంగాంలో ఆర్‌వోబీ నిర్మాణానికి రూ.60 కోట్ల మంజూరు చేస్తామని వెల్లడించారు. ఆ తర్వాత ఆయన నర్సిపురం స్టాప్‌తో పాటు సీతానగరం రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో కూడా అండర్‌ బ్రిడ్జీల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే విజయచంద్ర డీఆర్‌ఎంను కలిసి సమస్యలను విన్నవించారు. బెలగాం రైల్వేగేట్‌ కారణంగా 28 గ్రామాలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అత్యవసర సమయాల్లో ప్రాణాలు పోతున్నాయని తెలిపారు. చినభోగిలి కూడలిలో రైల్వే గేటును మూసివేయడంతో అటు రైతులు, ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారి రాకపోకల కోసం వంతెన నిర్మించాలని కోరారు. ఈ పరిశీలనలో రైల్వే అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 11:24 PM