Planting Seedlings.. పొలంలో దిగి.. నాట్లు వేసి..
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:58 PM
Stepping into the Fields.. Planting Seedlings.. ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి పొలం బాట పట్టారు. లక్కగూడ గ్రామంలో శుక్రవారం గిరిజన మహిళా రైతులతో కలిసి పొలంలో వరి నాట్లు వేశారు. అనంతరం వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గుమ్మలక్ష్మీపురం, ఆగస్టు14(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి పొలం బాట పట్టారు. లక్కగూడ గ్రామంలో శుక్రవారం గిరిజన మహిళా రైతులతో కలిసి పొలంలో వరి నాట్లు వేశారు. అనంతరం వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆమె తెలిపారు. రెండేళ్లలో రైతుల కోసం అమలు చేసిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆమె వెంట కురుపాం ఏఎంసీ చైర్‌పర్సన్ కళావతి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.