ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:10 AM
ఆత్మవిశ్వాసంతో దివ్యాంగులు ముందడుగు వేయాలని, ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్య్రంగా తమ రోజువారి కార్యక్రమా లను నిర్వహించుకుంటూ ముందుకు సాగేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు.
పార్వతీపురం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆత్మవిశ్వాసంతో దివ్యాంగులు ముందడుగు వేయాలని, ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్య్రంగా తమ రోజువారి కార్యక్రమా లను నిర్వహించుకుంటూ ముందుకు సాగేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. శనివారం పార్వతీపురం జూనియర్‌కళాశాల మైదానంలో జిల్లాలోని పార్వతీపురం, కురుపాం, పాలకొండ నియో జకవర్గాలకు చెందిన 30 మంది దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా జగదీశ్వరి మాట్లాడుతూ క్రీడలు, చదువులో ఎటువంటి సహ కారం కావాలన్నా ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. వృద్ధులు, దివ్యాం గులకు ఒకటో తేదీనే పింఛన్ అందించే ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుం దన్నారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ గడు పూటి నారాయణస్వామి మాట్లాడుతూ బాపట్లలో దివ్యాంగులకు డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశామని, దివ్యాంగులకు రాష్ట్రంలో సుమారు 370 బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీకి సీఎంని సంప్రదించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ దివ్యాంగుల ప్రతిభను గుర్తించి వారికి సమాన అవకాశాలు కల్పించడంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా స్వాలంబన సాధించేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ జిల్లా శాఖాధికారి బి.దేవరాజు, రమణ, బి.సాయిబాబు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
గుమ్మలక్ష్మీపురం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి హామీనిచ్చారు. శనివారం గుమ్మ లక్ష్మీపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు ప్రజలు తమ వ్యక్తిగత, స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాలు అందించారు అనంతరం ఫీల్డ్ అసిస్టెంట్లు ఎమ్మెల్యేకు తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యో గాలను పర్మినెంట్ చేయాలని, నెలకు కనీస వేతనంగా రూ.26 వేలు చెల్లించాలని, ప్రభు త్వ ఉద్యోగులకు వర్తించే ఇతర ప్రయోజనాలను కల్పించాలని ఫీల్డ్‌అసిస్టెంట్లు కోరారు.