చంద్రబాబు కృషితోనే స్టీల్‌ప్లాంట్
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:57 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నిరంతర కృషి వల్ల అనకాపల్లిలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటవు తోందని టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు.
విజయనగరం రూరల్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నిరంతర కృషి వల్ల అనకాపల్లిలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటవు తోందని టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు. బుధవారం విజయనగరంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ రావడం ఉత్తరాంధ్రకే తలమానికమన్నారు. స్టీల్ ప్లాంట్ ద్వారా రాబోయేకాలంలో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఉత్తరాంధ్రకు మరిన్ని పెట్టుబడులు తీసుకురావ డానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమిస్తున్నారని చెప్పారు. సమావేశంలో టీడీపీ నాయకులు ప్రసాదుల ప్రసాద్, గంటా రవి, గంటా పోలినాయుడు, పాసి అప్పలనాయుడు, పీతల కోదండరామ్ పాల్గొన్నారు.
కూటమితో ఉత్తరాంధ్ర అభివృద్ధి: కర్రోతు
భోగాపురం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం హయాంలో ఉత్తరాం ధ్ర అభివృద్ధిలో దూసుకుపోతోందని మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో ఇటీవల స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయడంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి శుభపరిణామ మని చెప్పారు. బుధవారం పోలిపల్లిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆర్సెలర్ మిట్టల్, నిస్సాన్‌స్టీల్ సంయుక్తంగా రూ.1,35,964 కోట్లకు పైగా పెట్టుబడితో అతి పెద్ద కర్మాగారాన్ని నిర్మించబోతున్నాయని తెలిపారు. దీంతో ప్రత్యేక్ష, పరోక్షంగా లక్షకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. మంత్రి నారా లోకేష్ కృషి, పట్టు దలతో పెట్టుబడుదారులతో నిరంత చర్చలు, జూమ్ మీటింగులతో భారీ పరిశ్ర మను తీసుకొచ్చారన్నారు.