నాటు వైద్యానికి దూరంగా ఉండండి’
ABN , Publish Date - May 15 , 2026 | 12:15 AM
నాటు వైద్యానికి దూరంగా ఉండాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు సూచించారు.
కొమరాడ, మే 14 (ఆంధ్రజ్యోతి): నాటు వైద్యానికి దూరంగా ఉండాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు సూచించారు. గురువారం సీసాడవలస గిరిజన గ్రామంలో నాటు వైద్యంపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రచార కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా అనారోగ్యానికి గురైతే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించి వైద్య సేవలు అందించాలన్నారు. మూఢనమ్మకాలు, నాటు వైద్యం లేని జిల్లాగా మార్చేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. వర్షాకాలం రాకముందే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి జగన్మోహన్‌రావు మాట్లాడుతూ నివాసాలకు దూరంగా పశువులు శాలలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వైద్యాధికారులు ఎం.శిరీష, జి.దేవేంద్ర పాల్గొన్నారు.