Share News

మత్తుపదార్ధాలకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Apr 23 , 2026 | 11:24 PM

మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ తెలిపారు.

  మత్తుపదార్ధాలకు దూరంగా ఉండాలి
పూసపాటిరేగ: అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ దామోదర్‌

- ఎస్పీ దామోదర్‌

పూసపాటిరేగ/భోగాపురం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ తెలిపారు. గురువారం స్థానిక జాతీయ రహదారి కూడలి వద్ద ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. ముందుగా పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. ప్రమాదాల నివారణకు తల్లిదండ్రులకు సూచనలిచ్చారు. ఎక్కడైనా గంజాయి ఉంటే 1972 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు నిబంధనలను పాటించాలని ఆయన తెలిపారు. జాతీయ రహదారిపై వాహనాలు నిలుపరాదన్నారు. త్వరలోనే వాహనాల వెనుక రేడియం స్టిక్కర్లను అంటించేందుకు తగిన చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌, పోలీసు పిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. భోగాపురం పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ దామోదర్‌ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను, బ్లాక్‌ స్పాట్ల వద్ద స్టాపర్లు, లైటింగు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మద్యం తాగి... వాహనాలు నడిపై వారు, ఆరుబయట మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. పెండింగు చలానాలు ఉంటే వాహనాలు సీజ్‌ చేయాలని ఆదేశించారు. పాఠశాలకు సెలవులు కావడంతో పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలన్నారు. అంతకుముందు రికార్డులు పరిశీలించారు. ఈ కార్యకమ్రంలో సీఐ కె.దుర్గాప్రపాదరావు, ఎస్‌ఐలు పాపారావు, సూర్యకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2026 | 11:24 PM