తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండండి
ABN , Publish Date - Oct 28 , 2026 | 12:17 AM
ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో పాలకొండ నగర పంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు.
పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ నూకరాజు
ప్రత్యేక అత్యవసర బృందం ఏర్పాటు
పాలకొండ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో పాలకొండ నగర పంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నగర పంచాయతీ కమిషనర్ నూకరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక అత్యవసర బృందాన్ని ఏర్పాటు చేశారు. కమిష నర్ వార్డు ప్లానింగ్ సెక్రటరీలు, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలు, ఇంజినీరింగ్ సిబ్బందితో ఆయన మంగళవారం సమావేశం నిర్వ హించారు. ఈసందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకో వాలన్నారు. పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి అంతరా యం కలగనివ్వవద్దన్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్య మిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నా మని కమిషనర్ తెలిపారు.
వర్షపునీరు నిల్వ ఉండకుండా చర్యలు
రాజాం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): రాజాంలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండిపో కుండా మున్సిపల్ కమిషనర్ ఎ.రామచంద్రరావు మంగళవారం చర్యలు చేపట్టారు. వర్షపునీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులతో దగ్గరుండి నీటిని మళ్లించేలా చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాం తాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. ఆయన వెంట ఏఈలు ఉన్నారు.
‘సురక్షిత ప్రాంతాల్లో ఉండండి’
రాజాం రూరల్, అక్టోబరు 27(ఆంరఽధజ్యోతి): తు ఫాన్ బుధవారం ఉదయానికి ఉధృతం కానున్న నేప థ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని తహసీల్దార్ రాజశేఖర్ సూచించారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల మే రకు గ్రామస్థాయిలో వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన ఆదే శించారు. గ్రామ స్థాయిలో సమస్యలు ఎదురైతే తహ సీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌రూం నెంబర్ 8333813281కు సమాచారం అందించి, సహా యం పొందాలని ఆయన కోరారు. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, బహిరంగ ప్రదేశాలలో తిరు గాడవద్దని సూచించారు. అత్యవసర వైద్యసేవలకు సంబంధించి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. శిథిల భవనాలలో ఉండవద్దని, గ్రామాలలో అలాంటి పరిస్థితులుంటే అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠ శాలలో, సచివాలయాలలో ఉండాలని సూచించారు.