Share News

Malaria మలేరియాపై అప్రమత్తం

ABN , Publish Date - Apr 29 , 2026 | 11:52 PM

Stay Alert Against Malaria మలేరియాపై ప్రజలు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు సూచించారు. సమష్టి కార్యాచరణతో మలేరియా నియంత్రణ మరింత సులభతరం అవుతుందన్నారు.

 Malaria మలేరియాపై అప్రమత్తం
చింతమానుగూడలో దోమతెరల వాడకంపై అవగాహన కల్పిస్తున్న డీఎంహెచ్‌వో

  • డీఎంహెచ్‌వో భాస్కరరావు

జియ్యమ్మవలస, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): మలేరియాపై ప్రజలు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు సూచించారు. సమష్టి కార్యాచరణతో మలేరియా నియంత్రణ మరింత సులభతరం అవుతుందన్నారు. వనజ గ్రామంలో ఒకరికి మలేరియా పాజిటివ్‌ రావడంతో బుధవారం ‘మా ఊరికి మలేరియా వచ్చింది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వనజలో పారిశుధ్యం పనులతో పాటు క్లోరినేషన్‌ కూడా చేయించారు. గ్రామస్థుందలరికీ రక్త పరీక్షలు నిర్వహించారు. జ్వర లక్షణాలున్న వారిని గుర్తించి చికిత్స అందించారు. ఆ ప్రాంతంలో డ్రమ్ములో నిల్వ ఉన్న నీటిని పారబోయించారు. అనంతరం దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై డీఎంహెచ్‌వో గ్రామస్థులకు అవగాహన కల్పించారు. జ్వర లక్షణాలున్న వారు సమీపంలో ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి, డీఐవో విజయమోహన్‌, డీఎంవో సూర్య నారాయణ, మలేరియా కన్సల్టెంట్‌ రామచంద్రుడు, పీహెచ్‌సీ వైద్యాధికారి పి.జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బుడ్డుడుగూడ, చింతమానుగూడ, టి.కె.జమ్ము గ్రామాల్లో పర్యటించారు. దోమతెరల వాడకంపై గిరిజనులకు అవగాహన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి, డీఐవో విజయమోహన్‌, డీఎంవో సూర్య నారా యణ, జిల్లా ఎన్‌సీడీ అధికారి టి.జగన్మోహన్‌రావు , మలేరియా కన్సల్టెంట్‌ రామచంద్రుడు, పీహెచ్‌సీ వైద్యాధికారి పి.జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2026 | 11:52 PM