రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Nov 23 , 2026 | 12:00 AM
గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి 70 ఎస్‌జీఎఫ్ నెట్‌బాల్ క్రీడా పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి.
గంట్యాడ, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి 70 ఎస్‌జీఎఫ్ నెట్‌బాల్ క్రీడా పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. వీటిని జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖాధికారి(డీవీఈవో) ఎస్.తవిటి నాయుడు ప్రారంభించారు. అనంతరం ఆయన క్రీడాకారులను పరిచ యం చేసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు తమ ప్రతిభను చక్కగా చూపించి జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన సుమారు 450 మంది బాల బాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలు ఈనెల 24 వరకూ నిర్వహిం చనున్నారు. క్రీడాకారులకు భోజనం, వసతి సదుపాయం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పూసపాటిరేగ ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హను మంతరావు, రాష్ట్ర స్థాయి అబ్జర్వర్ డి.శ్రీనివాసరావు, జిల్లా పీఈడీ, పీడీ అసోసి యేషన్ అధ్యక్షుడు, సెక్రటరీ వెంకటనాయుడు, తదితరులు పాల్గొన్నారు.