ముగిసిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలు
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:16 AM
ఏపీ స్టేట్స్ స్కూల్ గేమ్స్ కరాటే పోటీలు సోమవారంతో ముగిశాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వందలాది మంది క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు.
పాలకొండ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఏపీ స్టేట్స్ స్కూల్ గేమ్స్ కరాటే పోటీలు సోమవారంతో ముగిశాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వందలాది మంది క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు. అండర్-14, 17, 19 బాల బాలికల విభాగంలో సుమారు 800 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈవో బ్రహ్మాజీ, డాక్టర్ సిఎల్.నాయుడు విద్యాసంస్థల అధినేత డాక్టర్ సి.ఎల్.నాయుడు మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన క్రీడాకారులుగా అందరూ మెలిగారని కొనియాడారు. కోచ్ మేనేజర్లు చక్కగా పర్యవేక్షణ చేసి రాష్ట్రస్థాయి ఎంపికలను పూర్తి చేశారన్నారు. ఈ సందర్భంగా జాతీయ క్రీడలకు ఎంపికైన క్రీడాకారులను వారు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో పర్రి కృష్ణమూర్తి, ఎంఈవో సోంబాబు, వ్యాయాయ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మజ్జి రామకృష్ణ, స్కూల్ గేమ్ సెక్రటరీలు ఆర్.రాములు, దుర్గాదేవి డీఈవో కార్యాలయం నుంచి రంగాచారి, శంకరరావు, వ్యాయాయ ఉధ్యాయ సంఘం నుంచి నెల్లి వెంకటరమణ, పుష్పనాథం, ఉమామహేశ్వరరావు, ఎస్.వి.రమణ, సురేష్, రాము, రమణ, ఈశ్వరరావు, హైమ, చినమ్మడు, నిరీక్షణ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.