Share News

కూటమితోనే రాష్ట్రాభివృద్ధి

ABN , Publish Date - Oct 22 , 2026 | 12:47 AM

కూటమి పాలనలో రాష్ట్రాభివృద్ధి జరుగు తోందని టీడీపీ నాయకులు తెలిపారు.

కూటమితోనే రాష్ట్రాభివృద్ధి

  • జిల్లా వ్యాప్తంగా టీడీపీలో చేరికలు

కూటమి పాలనలో రాష్ట్రాభివృద్ధి జరుగు తోందని టీడీపీ నాయకులు తెలిపారు. బుధవారం ఉమ్మడి జిల్లాలో పలువురు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.

రాజాం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): గడిముడి దాం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరంతా ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ సమక్షంలో శ్యాంపురంలోని ఆయన క్యాంపు కార్యాల యంలో టీడీపీలో చేరారు. గురవాన నారాయణరావు, వంగా వెంకటరావు, ఎగిరెడ్డి శంకరరావు, గుణూపూర్‌ వెంకటరమణ, లక్ష్మంనాయుడు, సత్యనారాయణ, గంగరాజు పాల్గొన్నారు.

భోగాపు రం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): రెడ్డికంచేరులో దాసరిదానయ్య, దాస రిపోలయ్య, కారిరాములతో కలిసి వైసీపీ నుంచి 100 కుటుంబాలు టీడీపీలోకి నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, టీడీపీ మండలాధ్యక్షులు కర్రోతు సత్య నారాయణ ఆధ్వర్యంలో చేరారు. నీలాపుఅప్పల రా మిరెడ్డి, అరజర్ల ఎర్రోడుతాత పాల్గొన్నారు.

చీపురుపల్లి, అక్టోబరు 21(ఆంధ్ర జ్యోతి): మండలంలోని చిననడిపల్లి లో మాజీ సర్పంచ్‌ గడే సత్యవతి, ఉప సర్పంచ్‌ వెలిచేటి పద్మతో సహా రెం డు వందల కుటుంబాలు టీడీపీలో చేరాయి. టీడీపీ నాయకులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, దన్నాన రామచంద్రుడు ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌ నాయుడు వీరికి కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ నాయకులు వెలిచేటి మురళీ ధర్‌, మన్నె ప్రకాశ రావు, సప్ప సూరప్పడు పాల్గొన్నా రు.

మెంటాడ, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఉద్దంగి మాజీ సర్పంచ్‌ కొర్రాయి లక్ష్మి,గౌరి శంకర్‌ దంపతులు టీడీపీ మండ లాధ్యక్షుడు చలుమూరి వెంకట్రావు ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వారి వెంట సుమారు 60 కుటుంబాలు కూడా తెలుగు దేశం పార్టీలో చేరాయి.

నెల్లిమర్ల, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): బొప్పడాం గ్రామంలో 150 కుటుం బాలు బుధవారం వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వీరంతా టీడీపీ నాయకులు రవిశేఖర్‌, బొంతు రమణ ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Updated Date - Oct 22 , 2026 | 12:47 AM