చిన్నారి ప్రాణాలకు అండగా నిలవండి
ABN , Publish Date - May 05 , 2026 | 12:39 AM
విజయ నగరం కోరుకొండకు చెందిన రెండు నెలల చిన్నారి కృష్ణకు సాయం అందించి, ప్రాణాలకు అండగా నిలవా లని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
మంత్రి శ్రీనివాస్
సాయం చేసి.. ఆదుకోండి: ఎమ్మెల్యే అదితి
విజయనగరం రూరల్, మే 4(ఆంరఽధజ్యోతి): విజయ నగరం కోరుకొండకు చెందిన రెండు నెలల చిన్నారి కృష్ణకు సాయం అందించి, ప్రాణాలకు అండగా నిలవా లని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమ వారం స్థానిక టీడీపీ కార్యాలయంలో వివిధ స్వచ్ఛంద, సేవా సంస్థలు, నగరంలోని ప్రముఖులతో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సమావేశం నిర్వహించారు. చిన్నారి కృష్ణ ఆరోగ్య పరిస్థితి.. రూ.16 కోట్ల ఆర్థిక సాయంపై వివరించారు. ఇందుకోసం క్యూఆర్ కోడ్‌ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీనివాస్ తన వంతు సాయం కింద రూ.1లక్ష ప్రక టించారు. జిల్లాలోని అందరూ దీనిపై స్పందించాలని కోరారు. అదే విధంగా రోటరీ క్లబ్, రోటరీ క్లబ్ సెంట్రల్, లయన్స్ క్లబ్, ఇన్నవీర్‌వీల్, డాక్టర్లు, మెసానిక్ టెంపుల్, క్షత్రియ పరిషత్‌తో పాటు పలువురు స్వచ్ఛందంగా తమ విరాళాలను క్యూఆర్ కోడ్ ద్వారా అందజేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవకాశం ఉన్న ప్రతిఒక్కరూ సాయం అందించాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నారి కృష్ణకు మస్కులర్ అట్రోఫీ టైప్-1(ఎస్‌ఎంఏ) చికిత్స కోసం ఆర్థిక సాయం అందించడానికి అందరూ మానవతా దృక్పథంతో ముం దుకు రావాలని కోరారు. అనంతరం మంత్రి చిన్నారిని ఎత్తుకున్నారు. ఇటువంటి అరుదైన వ్యాధిని నయం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, ఈ విష యాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉందని, చిన్నారి ప్రాణాలకు ఎలాంటి భయం ఉండదని ఆయన చిన్నారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.