అటకెక్కుతున్న ప్రతిపాదనలు
ABN , Publish Date - Mar 26 , 2026 | 12:01 AM
మండలంలోని తాండ్రంగి-తానవరం గ్రామాల మధ్యలో గల గోస్తనీ నదిపై వంతెన నిర్మాణం అటకెక్కుతోంది. ఇక్కడ వంతెన నిర్మించాలని దశాబ్దాలుగా ఎల్.కోట, జామి, ఎస్.కోట మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు అధి కారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తున్నా ఒక్క అడుగూ ముందుకుపడడం లేదు. దీంతో ఏటా వర్షాకాలంలో సుమారు పదిగ్రామాల ప్రజలు అవస్థల కు గురవుతున్నారు.
జామి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తాండ్రంగి-తానవరం గ్రామాల మధ్యలో గల గోస్తనీ నదిపై వంతెన నిర్మాణం అటకెక్కుతోంది. ఇక్కడ వంతెన నిర్మించాలని దశాబ్దాలుగా ఎల్.కోట, జామి, ఎస్.కోట మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు అధి కారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తున్నా ఒక్క అడుగూ ముందుకుపడడం లేదు. దీంతో ఏటా వర్షాకాలంలో సుమారు పదిగ్రామాల ప్రజలు అవస్థల కు గురవుతున్నారు.
తాండ్రంగి-తానవరం గ్రామాల మధ్యలో ఉన్న గోస్తనీ నదిపై వంతెన లేకపోవడంతో ఎస్.కోట మం డలంలోని ఆలుగుబిల్లి, చామలాపల్లి, ధర్మవరం, కిమి డి, వెంకటరమణపేట, చుక్కవానిపాలెం జామి మం డలంలోని చింతాడ, జాగరం, ఎల్.కోట మండలంలోని వీర భద్రపేట తదితర గ్రామాల ప్రజలు ఎస్.కోట చేరుకోవడానికి పది కిలోమీటర్లు అదనంగా ప్రయా ణించాల్సివస్తోంది. అత్యవసర పరిస్థితి ప్రాణాలకు తెగించి నదిలో దిగి వెళ్లాల్సివస్తోందని పలువురు వాపోతున్నారు. గత ప్రభుత్వం హయాంలో రెండు కోట్ల ఉపాధి హామీ పథకం నిధులతో ప్రతిపాదనలు చేసినా మంజూరుకాలేదు. తాజాగా కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ వంతెన నిర్మాణానికి మూడు కోట్లతో ప్రతిపాదనలు పంపిం చారు. ప్రతి ఏటా నిర్వహించే గ్రామసభల్లో కూడా వంతెన నిర్మించాలని తీర్మానించి ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపిస్తున్నా నిధులు మంజూరుకావడం లేదని పలువురు వాపోతున్నారు. ఈ రెండు గ్రామాల మధ్య వంతెన కలగా మారింది. వర్షాకాలంలో తాము పడుతున్న అవస్థలను గుర్తించి వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎస్.కోట, ఎల్.కోట, జామి మం డలాల్లోని పలుగ్రామాల ప్రజలు కోరుతున్నారు. కాగా గతం లో ఇక్కడ కాజ్‌వేకు ప్రతిపాదనలు తయారు చేశామని పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు.