నేరాల అదుపులో సిబ్బంది పని తీరే కీలకం
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:37 PM
నేరాల అదుపులో క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరే కీలకమని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఆదివారం బొబ్బిలి రూరల్ పోలీసుస్టేషన్ ప్రాంగణంలో పోలీసు సిబ్బందితో ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం వారందరితో కలిసి అల్పాహారంలో మమేకమయ్యారు. సిబ్బంది యోగక్షేమాలపై ఆరా తీసి విధులపై దిశా నిర్దేశం చేశారు.
బొబ్బిలి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): నేరాల అదుపులో క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరే కీలకమని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఆదివారం బొబ్బిలి రూరల్ పోలీసుస్టేషన్ ప్రాంగణంలో పోలీసు సిబ్బందితో ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం వారందరితో కలిసి అల్పాహారంలో మమేకమయ్యారు. సిబ్బంది యోగక్షేమాలపై ఆరా తీసి విధులపై దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో బొబ్బిలి డీఎస్పీ రాకోటి గోవిందరావు, సీఐ కింతలి నారాయణరావు, ఎస్‌ఐలు నవీన్ పడాల, రెడ్డి శ్రీరాములు పాల్గొన్నారు.
చదువును నిర్లక్ష్యం చేయరాదు
చదువును ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయరాదని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఆదివారం బొబ్బిలిలోని సిరిపురపు వీధిలో గల హేండ్ ఇన్ హేండ్ సొసైటీ చిల్డ్రన్ హోంలో పిల్లల బాగోగులను అడిగి తెలుసుకోవడంతోపాటు నిత్యావసరాలను అంద జేశారు. అనంతరం మాట్లాడుతూ గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై మంచి అవగాహన కలిగి ఉండాలన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
రామభద్రపురం/బాడంగి, జూలై 12(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. రామభద్రపురం, బాడంగి పోలీసు స్టేషన్లను ఎస్‌ఐ తనిఖీచేశా రు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రమాదాల నియంత్రణకు కూడళ్లు, మలుపులు, స్కూల్ జోన్స్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో బొబ్బిలి డీఎస్పీ గోవిందరావు, టౌన్ సీఐ నారాయణరావు, రామభద్రపురం ఎస్‌ఐ జ్ఞానప్రసాద్, బాడంగి ఎసీఐ సూర్యకుమారి పాల్గొన్నారు.