సిబ్బంది అందుబాటులో ఉండాలి
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:30 AM
ప్రజలకు సిబ్బంది అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. బుధవారం జిల్లాలోని వరద ప్రభావిత, లోతట్టు ప్రాంతాల్లో అధికారులను పర్యటించారు.
ప్రజలకు సిబ్బంది అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. బుధవారం జిల్లాలోని వరద ప్రభావిత, లోతట్టు ప్రాంతాల్లో అధికారులను పర్యటించారు.
ఫవేపాడ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): వర్షాల విస్తారంగా కురుస్తుండడంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జేసీ కలెక్టర్ సేతుమాదవన్ ఆదేశించారు. వేపాడ తహసీల్దార్ కార్యాలయంలో ఏ ర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. కార్య క్రమంలో తహసీల్దార్ రాములమ్మ పాల్గొన్నారు.
ఫవంగర, సెప్టెంబరు23 (ఆంధ్రజ్యోతి): మడ్డు వలస రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబా టులో ఉండి పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చీపురుపల్లి ఆర్డీవో సంధ్యారాణి ఆదేశించారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో మడ్డువలస రిజర్వాయర్‌కు వరద నీరు వచ్చి చేరుతుండడం వల్ల బుధవారం పరిశీలించారు. తొలుత ప్రాజెక్టు ఇంజ నీరింగ్ సిబ్బందితో మాట్లాడి ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వివ రాలను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 65 మీటర్లు కాగా ప్రస్తుతం 63.45 మీటర్లకు చేరుకుందని అధికారులు ఆర్డీవోకు వివరిం చారు. ఆమె వెంట తహసీల్దార్ రామారావు, ఇంజ నీరింగ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
ఫసంతకవిటి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): నాగా వళి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యం లో కేఆర్‌పురంలో ఆర్డీవో సుధారాణి, మండల ప్రత్యేకాధికారి వెంకట ప్పలనాయుడు, తహసీ ల్దార్ బి. సుదర్శనరావు, ఎంపీడీవో వి.శ్రీనివాసరావు, రంగారాయపుంలో మండల ప్రత్యేకాధికారి పర్యటించారు.
ఫరేగిడి, సెప్టెంబరు 23,(ఆంధ్రజ్యోతి): మండ లంలో సంకిలి, రేగిడి, వెంకమ్మపేట లోతట్టు గ్రామాల్లో ఆర్డీవో సుధారాణి, తహసీల్దార్ ఈశ్వరరావుతో సందర్శించారు. సంకిలి వద్ద నాగావళి వరద ఉధృతిని ఆమె పరిశీలించారు. తోటపల్లి ప్రాజెక్టు నుంచి ఆరు వేలు క్యూసెక్కులు నదీలో రావడం గమనించి సచివాలయ, రెవెన్యూ సి బ్బంది లోతట్టు గ్రామాల్లో రాత్రిపూట మకాం ఉండాలని కోరారు. మండల కేం ద్రంలో కంట్రోల్ రూమ్‌తో వరదను సమీక్షించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.
ఫరాజాం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): డోల పేటలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో మునిసిపల్ కమిషనర్ రామచంద్రరావు, ఏఈ వెంకటరామరాజు, సిబ్బంది పరిశీలించారు.ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బందిని అందుబాటులో ఉంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఫ మెంటాడ సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): తుఫా న్ తీరం దాటానున్న క్రమంలో వర్షాలు, గాలులు ఊపందుకోవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ విజయభ్కార్ కోరారు. ఆండ్ర జలా శయాన్ని ఎంపీడీవో విమలకుమారితో కలిసి పరిశీలిం చారు. నీటిమట్టం, మట్టికట్ట ముంపు ప్రాంతాల వివ రాలు జేఈ కృపానంద్‌ను అడిగితెలుసుకున్నారు. ఆగూరు, రెల్లిగూడెం, మెంటాడ వైన్ షాప్ సమీ పంలో చంపావతి నదిలోకి దిగకుండా తడకలతో కం చెలు, కొన్నిచోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
ఫగంట్యాడ, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి) మం డలంలోని చంద్రంపేట గెడ్డను ఆర్డీవో సుధాసా గర్ తనిఖీచేశారు. గెడ్డ పొంగి ప్రవహించడంతో పరిసర గ్రామాలకు రాక పోకలు నిలిపివేశారు. ఎవ రైనా నిబంధనలకు అతిక్ర మించి గెడ్డలోకి వాహనా లపై వెళ్తేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తహ సీల్దార్ సూర్యకాంతంకు ఆదేశించారు.
ఫ భోగాపురం, సెప్టెంబరు23(ఆంధ్రజ్యోతి): తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్ధార్ జి.హేమంత్‌కుమార్, సీఐ కె.దురా ్గప్రసా దరావు మత్స్యకారులకు హెచ్చరించారు. ముక్కాం, చేపల కంచేరుల్లో పర్యటించి ప్రజలకు తుఫాన్‌పై సూచనలు చేశారు. అలాగే రాజాపులోవ సమీపం విజయనగరం వైపు నుంచి విశాఖ వైపు వెళ్లే జాతీయరి రహదారిపై నిల్వ ఉన్న నీటిని మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వరావు, ఇరిగేషన్ జేఈ రమేష్ చంద్రతో కలిసి మళ్లీంచేలా చర్యలు చేపట్టారు.
ఫనెల్లిమర్ల, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): తుఫాన్ దృష్టాయ స్వర్ణ గ్రామ సిబ్బంది 24 గంటలు ప్రజల కు అందుబాటులో ఉండాలని అధికారులు కోరారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ సీఈవో ఎ.లవరాజు ఎంపీడీవో శంకర్ జగన్నాథ్, సిబ్బందితో సమావేశం నిర్వహించారు.