Share News

వన్నలిలో భూ సమస్యలపై సిబ్బంది ఆరా

ABN , Publish Date - Feb 02 , 2026 | 12:08 AM

రేగిడి మండలం వన్నలి గ్రామంలో ఈనెల 7, 9 తేదీల్లో ఏదో ఒక రోజు సీఎం పర్యటన ఉంటుంద న్న సమాచారంపై అధికారు లు, సిబ్బంది అప్రమత్తమ య్యారు.

వన్నలిలో భూ సమస్యలపై సిబ్బంది ఆరా

రేగిడి, ఫిబవరి 1(ఆంధ్ర జ్యోతి): రేగిడి మండలం వన్నలి గ్రామంలో ఈనెల 7, 9 తేదీల్లో ఏదో ఒక రోజు సీఎం పర్యటన ఉంటుంద న్న సమాచారంపై అధికారు లు, సిబ్బంది అప్రమత్తమ య్యారు. పర్యటన అధికారి కంగా ఖరారు కాకపోయినా, జిల్లా కలెక్టర్‌ నుంచి ఈమే రకు సంకేతాలు ఉండటంతో ఒక వైపు సభా స్థలి, హెలీ ప్యాడ్‌ స్థలాలు ఖరారు చేశా రు. మరోవైపు వన్నలి భూ సమస్యలు, జారీ చేసిన పట్టాలపై సిబ్బంది పరిశీ లిస్తున్నారు. భూసర్వేలో ఈ గ్రామం రాష్ట్ర స్థాయిలో టాప్‌లో ఉండటంతో సీఎం పర్యటించవచ్చున్న సమాచారం ఉంది. దీంతో ఆదివారం సెలవు దిన మైనా తహసీల్దార్‌ కృష్ణలత, వీఆర్వోలు, సర్వేల బృందం ఈ గ్రామంలో మకాం వేసి మరీ భూసర్వేతీరుపై లోతైన పరిశీలన చర్యలు చేపట్టారు. దీనిపై తహసీ ల్దార్‌ మాట్లాడుతూ సీఎం పర్యటనపై ఇంకా ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. రికార్డులు మాములుగా తనిఖీ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

Updated Date - Feb 02 , 2026 | 12:08 AM