ఆలయాలకు శ్రీవాణి ట్రస్టు నిధులు
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:24 AM
గ్రామీణ ప్రాంతాల్లో ఆల యాల నిర్మాణం, అభివృద్ధికి శ్రీవాణి ట్రస్టు నిధులు విని యోగిస్తున్నట్లు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలి పారు.
పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ
పాలకొండ, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో ఆల యాల నిర్మాణం, అభివృద్ధికి శ్రీవాణి ట్రస్టు నిధులు విని యోగిస్తున్నట్లు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలి పారు. సోమవారం మండలంలోని గరుగుబిల్లిలో టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా మంజూరైన రూ.15 లక్షలతో బంగారమ్మతల్లి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
టెట్ నుంచి మినహాయించండి
ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్‌ను మినహాయించాలని ఫ్యాప్టో సభ్యులు కోరారు. ఈమేరకు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు సోమవారం జిల్లా ప్యాప్టో సెక్రటరీ జనరల్ గొల్ల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో యూటీఎఫ్ నాయకు లు పైడిరాజు, గోవిందరావు, దుర్గాప్రసాద్, ఏపీటీఎఫ్ నాయకులు మురళి, ధనుంజయ్, రామారావు, బీటీఏ నాయకులు కిషోర్ వినతిపత్రం అందించారు. టెట్ తప్పనిసరి చేస్తే ప్రిపరేషన్ కోసం ఎక్కువ శాతం ఉపాధ్యాయులు సెల వులు పెట్టే అవకాశముందని, దీంతో టీచర్లతో పాటు విద్యార్థులు కూడా ఇబ్బం దులు పడే అవకాశముందని తెలిపారు.
పేదలపాలిట సీఎంఆర్‌ఎఫ్ వరం
పార్వతీపురం రూరల్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంజూరుచేస్తున్న సీఎం సహాయనిధి పేదల పాలిట వరమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. సోమవారం మండలంలోని వెంకంపేట పంచాయతీ పరిధి లో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి చెక్కు లను పంపిణీచేశారు. కార్యక్రమంలో కొప్పల వెలమ కార్పొరేషన్ డైరె క్టర్ జీవీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.