Share News

ఆలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్టు నిధులు

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:15 AM

గ్రామాల్లో ఆలయాల నిర్మాణంకోసం టీటీడీ శ్రీవాణిట్రస్టు ద్వారా నిధులు కేటాయించనున్నట్లు శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు.

ఆలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్టు నిధులు
వేపాడ: టీడీపీలో చేరిన ఒబలయ్యపాలెం గ్రామస్థులతో లలితకుమారి

కొత్తవలస, అక్టోబరు 14 ( ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ఆలయాల నిర్మాణంకోసం టీటీడీ శ్రీవాణిట్రస్టు ద్వారా నిధులు కేటాయించనున్నట్లు శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. బుధవారం మండలంలోని ముసిరాంలో రూ. 40 లక్షల శ్రీవాణి ట్రస్టు నిధులతో నిర్మించే ముత్యాలమ్మ ఆలయానికి శంకుస్థాపన చేశా రు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ఆధ్యాత్మికశోభ వెళ్లివిరియాలన్న ధ్యేయంతో ఆలయాలనకు నిధులు సమకూర్చడానికి శాయశక్తులా కృషి చేస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్‌ చైర్మన్‌ పీవీ రత్నాజీ, కొత్తవలస పీఏసీఎస్‌ అధ్యక్షుడు వెంకటరమణ, రాంప్రసాద్‌, గొంప దుర్గాఉమేష్‌ పాల్గొన్నారు.

ఫలక్కవరపుకోట, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): పేదల ఆరోగ్యభద్రతకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కొండంత అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే లలితకుమారి తెలిపారు. లక్కవ రపుకోటలో మంగలపాలెం గ్రామానికి చెందిన జామి కృష్ణ ఆరోగ్య ఖర్చులు నిమిత్తం రూ.4.5 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి విడుదలచేసిన చెక్కును అందజేశారు.

టీడీపీలో చేరిన వారిని కాపాడుకుంటాం

వేపాడ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): టీడీపీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి భరోసా ఇచ్చారు. బుధవారం ఒబలయ్యపాలెం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణ మూర్తి ఆధ్వర్యంలో చేరా యి. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో లలితకుమారి టీడీపీలో చేరుతున్న వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోగాడ జగన్నాధంనాయుడు, జామి అప్పలనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2026 | 12:15 AM