Share News

ఆలయాల నిర్మాణానికి శ్రీవాణి నిధులు

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:36 AM

ఎస్‌.కోట నియోజ కవర్గంలో నూతనంగా నిర్మించే ఆలయాలకు శ్రీవాణి ట్రస్ట్‌ నిధులు మంజూరైన ట్టు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు.

ఆలయాల నిర్మాణానికి శ్రీవాణి నిధులు

  • ఎస్‌.కోట ఎమ్మెల్యే లలితకుమారి

శృంగవరపుకోట(లక్కవరపుకోట), ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ఎస్‌.కోట నియోజ కవర్గంలో నూతనంగా నిర్మించే ఆలయాలకు శ్రీవాణి ట్రస్ట్‌ నిధులు మంజూరైన ట్టు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. ఆదివారం ఆమె ఎల్‌.కోటలో విలేకర్ల తో మాట్లాడారు. కొత్తవలస మండలం ముసిరాంలో ముత్యాలమ్మతల్లి దేవాల యం, వీరభద్రపురం బీసీ కాలనీలో కోటమ్మతల్లి దేవాలయం, ఎంఆర్‌ పురం బీసీ కాలనీలో నిర్మించబోయే బంగారమ్మతల్లి ఆలయం, రాజపాత్రునిపాలెం మిక్స్‌డ్‌ కాలనీలో రావాలమ్మతల్లి ఆలయం, ఎల్‌.కోట మండలం తామరాపల్లి బీసీ కాలనీ లో మరిడమ్మతల్లి ఆలయం, వేపాడ మండలం కృష్ణరాయుడుపేటలో బంగారమ్మ ఆలయాల నిర్మాణాలకు నిధులు వచ్చాయని ఆమె వివరించారు. గతంలో టైప్‌ సీ ఆలయాలకు రూ.20లక్షలు మంజూరు చేసేవారని, ఇప్పుడు దీనిని రూ.40లక్షలకు పెంచడంపై హర్షం వ్యక్తంచేస్తూ టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆలయాల ను సంవత్సర కాలంలో పూర్తిచేయాలన్నారు. ఈ నిధులు మంజూరు చేసినందు కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడులకు నియోజకవర్గ ప్రజల తరపున ఆమె కృతజ్ఞత లు తెలిపారు.

Updated Date - Aug 31 , 2026 | 12:36 AM