Share News

Sri Vari Kalyanotsavam 29న శ్రీవారి కల్యాణోత్సవం

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:28 AM

Sri Vari Kalyanotsavam on 29th ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి దేవస్థానం స్వామివారి కల్యాణోత్సవానికి ముస్తాబవుతోంది. ఈ నెల 29న వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల ఆవరణలో ఈ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు.

Sri Vari Kalyanotsavam  29న శ్రీవారి కల్యాణోత్సవం
తోటపల్లిలో చలువ పందిరిని ఏర్పాటు చేస్తున్న దృశ్యం

గరుగుబిల్లి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి దేవస్థానం స్వామివారి కల్యాణోత్సవానికి ముస్తాబవుతోంది. ఈ నెల 29న వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల ఆవరణలో ఈ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దేవస్థాన ప్రాంగణం ఆధునికీకరణ చేశారు. స్వామి వారి కల్యాణ మహోత్సవానికి గతంలో కంటే ఈసారి అధికంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఈవో బి.శ్రీనివాస్‌, చైర్మన్‌ ఎం.పకీరునాయుడు శుక్రవారం తెలిపారు. కల్యాణోత్సవం తర్వాత భక్తజనం నడుమ నాగావళి నదిలో స్వామివార్లకు శ్రీచక్ర స్నానం నిర్వహిస్తామన్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. కాగా స్వామివారి కల్యాణానికి హాజరయ్యే భక్తులు ముందుగా తమ గోత్రనామాలతో కార్యాలయంలో సంప్రదిం చాలని కోరారు.

Updated Date - Jan 10 , 2026 | 12:28 AM