Sravana Festivity మార్కెట్‌కు శ్రావణ శోభ
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:16 AM
Sravana Festivity Brightens the Market జిల్లాలోని ప్రధాన మార్కెట్లు శ్రావణశోభను సంతరిం చుకున్నాయి. రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు, లక్ష్మీదేవి పూజలకు అవసరమైన వస్తు సామగ్రి, పూలు, పండ్లు కొనుగోలు చేసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. దీంతో గురువారం పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరుతో పాటు అన్ని మండల కేంద్రాల్లోనూ మార్కెట్లు, షాపులు కిటకిటలాడాయి.
నింగినంటిన పూజా సామగ్రి ధరలు
పార్వతీపురం టౌన్/పాలకొండ, ఆగస్టు20(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రధాన మార్కెట్లు శ్రావణశోభను సంతరిం చుకున్నాయి. రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు, లక్ష్మీదేవి పూజలకు అవసరమైన వస్తు సామగ్రి, పూలు, పండ్లు కొనుగోలు చేసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. దీంతో గురువారం పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరుతో పాటు అన్ని మండల కేంద్రాల్లోనూ మార్కెట్లు, షాపులు కిటకిటలాడాయి. డిమాండ్ దృష్ట్యా పూలు, పండ్లు ధరలను వ్యాపారులు అమాంతం పెంచేశారు. ఆపిల్, బత్తాయి, దానిమ్మ, ద్రాక్ష తదితర పండ్లు ధర కిలో రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయించారు. జామకాయలు కిలో రూ.200వరకు అమ్మారు. బంతి, చామంతి, ఇతర పైల ధరలను కూడా భారీగా పెంచేశారు. నిన్నమొన్నటివరకు మార్కెట్‌లో కిలో బంతి పూల ధర రూ.300 ఉండగా, ప్రస్తుతం రూ.1000కు పెంచారు. చామంతి కిలో రూ.400 నుంచి రూ.1100 వరకు విక్రయిస్తున్నారు. ఎన్నడూ లేని విఽధంగా డజను అంటిపళ్లు ధర రూ.150కు చేరుకోగా కొబ్బరికాయను రూ.50 నుంచి రూ.70కు విక్రయించారు. ధరలు నింగినంటినా.. శ్రావణ శ్రుకవారం లక్ష్మీదేవి పూజ కోసం భక్తులు తమ స్తోమతకు తగ్గట్లుగా పూజాసామగ్రిని కొనుగోలు చేశారు.