Share News

సైనిక్‌ స్కూల్‌లో ముగిసిన క్రీడాపోటీలు

ABN , Publish Date - Aug 23 , 2026 | 12:24 AM

కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో ఈనెల 19 నుంచి ప్రారం భమైన ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్స్‌ నేషనల్‌ గేమ్స్‌(ఏఐఎస్‌ఎస్‌ ఎన్‌జీ)-2026 ఇంటారా గ్రూప్‌ క్రీడా పోటీలు శనివారంతో ముగిశాయి.

సైనిక్‌ స్కూల్‌లో ముగిసిన క్రీడాపోటీలు

విజయనగరం రూరల్‌, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో ఈనెల 19 నుంచి ప్రారం భమైన ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్స్‌ నేషనల్‌ గేమ్స్‌(ఏఐఎస్‌ఎస్‌ ఎన్‌జీ)-2026 ఇంటారా గ్రూప్‌ క్రీడా పోటీలు శనివారంతో ముగిశాయి. ఈ క్రీడా పోటీల్లో కోరుకొండతో పాటు అంబికాపూర్‌, భువనేశ్వర్‌, సంబల్‌పూర్‌ ఆదర్శశీల మందిర్‌ పాఠశాల కేడేట్లు పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ గ్రూప్‌ కెప్టెన్‌ ఎస్‌ఎ స్‌ శాస్త్రి ముఖ్య అతిథిగా హాజరై ముగింపు వేడుకలు నిర్వహించారు. మార్చ్‌ఫాస్ట్‌, పరేడ్‌ నిర్వహించారు. వివిధ పోటీల్లో విజేతలకు ప్రిన్సిపాల్‌ ఎస్‌ఎస్‌ శాస్త్రి, వైస్‌ ప్రిన్సిపాల్‌ వి.కిరణ్‌ ప్రశంసాపత్రాలు, ట్రోఫీలు అందజేశారు. అంబికాపూర్‌ సైనిక్‌ స్కూల్‌ విద్యార్థులు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ని కైవసం చేసుకున్నారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జట్లకు వ్యక్తిగత పతకాలు, ట్రోఫీలను అందజేశారు.

Updated Date - Aug 23 , 2026 | 12:24 AM