Share News

ఏకలవ్య’లో క్రీడా పోటీలు ప్రారంభం

ABN , Publish Date - Oct 01 , 2026 | 12:14 AM

స్థానిక ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో బుధవారం క్లస్టర్‌-1 స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి.

ఏకలవ్య’లో క్రీడా పోటీలు ప్రారంభం
క్రీడాజ్యోతితో ఐటీడీఏ పీవో వైశాలి

గుమ్మలక్ష్మీపురం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో బుధవారం క్లస్టర్‌-1 స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను ముఖ్యఅతిథిగా ఐటీడీఏ పీవో, ఇన్‌చార్జి జేసీ వైశాలి పాల్గొని క్రీడాజ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్‌ రజని, తహసీల్దార్‌ రంజిత్‌కుమార్‌, గుమ్మలక్ష్మీపురం ఈఎంఆర్‌ఎస్‌ ప్రిన్సిపాల్‌ వీర్‌సింగ్‌తో పాటు క్లస్టర్‌-1 పరధిలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, పీఈటీలు, ఎస్కార్ట్‌ టీచర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. క్లస్టర్‌-1 పరిధిలోని పది ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల నుంచి విద్యార్థులు క్రీడా పోటీల్లో పాలొన్నారు. వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, టేబుల్‌ టెన్నీస్‌, కబడ్డీ, ఖోఖో, చెస్‌, క్యారమ్స్‌, హాకీ, టగ్‌ ఆఫ్‌ వార్‌ తదితర క్రీడాంశాల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.

Updated Date - Oct 01 , 2026 | 12:14 AM