క్రీడలతో మానసికోల్లాసం: ఎమ్మెల్యే అదితి
ABN , Publish Date - May 06 , 2026 | 12:18 AM
క్రీడలతోనే మానసిక ఉల్లాసం లభిస్తుందని ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు అన్నారు.
విజయనగరం టౌన్, మే9(ఆంధ్రజ్యోతి): క్రీడలతోనే మానసిక ఉల్లాసం లభిస్తుందని ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు అన్నారు. నగరంలోని విజ్జీ క్రీడా మైదానంలో సర్ విజ్జీ టీ-20 క్రికెట్ ట్రోఫీని ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ముందుగా ఇందులో పాల్గొనున్న 52 జట్లకు సంబంధిం చిన యూనిఫారాలను అందజేశారు. అనంతరం మైదా నంలోకి వెళ్లి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఇరు జట్లకు మధ్య టాస్ వేసి క్రికెట్‌ను ప్రారంభించా రు. ముందుగా ఆమె బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఆనందపరిచారు. అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.