Development Works అభివృద్ధి పనులు వేగవంతం
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:15 AM
Speed Up Development Works జిల్లాలోచేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై చర్చించారు.
పార్వతీపురం, ఫిబ్రవరి13(ఆంధ్రజ్యోతి): జిల్లాలోచేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై చర్చించారు. అంతకుముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ ఈస్ట్‌వెస్ట్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో జరిగిన సమా వేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత నాలుగు ఏళ్లుగా సాలూరు డిగ్రీ కళాశాల హాస్టల్ పనులు నిలిచిపోయినట్లు జిల్లా అధికారులు తెలపగా.. ఎన్‌ఐఆర్‌ఎఫ్ నిధులు విడుదల కాకపో వడమేనని కమిటీ గుర్తించింది. వెంటనే కలెక్టరేట్ నుంచి కాలేజీ విద్యాశాఖకు లేఖ రాయాలని ఆదేశించింది. మిగులు నిధులతో ఆర్‌వో ప్లాంట్లు, అదనపు వాష్‌రూమ్‌లు, రూఫింగ్ పనులు చేపట్టాలని ఇంజనీర్లకు ఉన్నతాధికారులు సూచించారు. బాలికల విద్యా సంస్థల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నప్పుడు 12 అడుగుల గ్రీన్‌మెస్ లేదా కర్టెన్లను ఏర్పాటు చేయాలన్నారు. పీఎం జన్‌మన్ కింద 19 గిరిజన సంక్షేమ వసతి గృహాల పనులు వేగవంతం చేయాలని, మార్చి నాటికి వన్‌స్టాప్ సెంటర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఆర్థిక సాక్షరత పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఆర్థిక అవగాహనతో సైబర్ మోసాలను నివారించొచ్చని తెలిపారు. ప్రతిఒక్కరూ సురక్షిత బ్యాంకింగ్ పద్ధతులను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాధవరెడ్డి, జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, లీడ్ జిల్లా మేనేజర్ ఎస్.సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఏనుగుల సంరక్షణ కేంద్రం పనుల పరిశీలన
సీతానగరం, ఫిబ్రవరి13(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం రేంజ్, గుచ్చిమి రిజర్వు ఫారెస్టులో సుమారు రూ. 3 కోట్లతో చేపడుతున్న తాత్కాలిక ఏనుగుల సంరక్షణ కేంద్రం పనులను కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా నిర్మిస్తున్న కందకాలు, సోలార్ హ్యాంగింగ్ ఫెన్సింగ్, షెడ్లు, వాటర్ టబ్‌లు, స్నానపు కొలనులను పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. గుచ్చిమి బీట్‌లోని సుమారు 50 హెక్టార్ల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నట్లు డీఎఫ్‌వో ప్రసూన తెలిపారు. మావటీల కోసం ప్రత్యేక క్వార్టర్లు, కిచెన్ షెడ్, ఏనుగుల ఆరోగ్య సంరక్షణ కోసం అత్యాధునిక వెటర్నరీ కేర్ సెంటర్ (వైద్య కేంద్రం) ఏర్పాటు చేయనున్నట్లు ఆమె చెప్పారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే ఏనుగులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం సాధ్యమవుతుందన్నార ఈ పరిశీలనలో సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తదితరులు ఉన్నారు.