Speed Boat ‘తోటపల్లి’లో స్పీడ్ బోటు
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:31 AM
Speed Boat at Totapalli తోటపల్లిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ఆదివారం రిజర్వాయర్‌లో స్పీడ్ బోటును కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా బోటులో ప్రయా ణించి భద్రతా ప్రమాణాలను పరిశీలించారు.
గరుగుబిల్లి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): తోటపల్లిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ఆదివారం రిజర్వాయర్‌లో స్పీడ్ బోటును కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా బోటులో ప్రయా ణించి భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తోటపల్లి రిజర్వాయర్ పరిసర ప్రాంతాలను పర్యాటక హబ్‌గా మార్చనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఐటీడీఏ పార్కులో ఉన్న వసతులకు తోడు యువత, పర్యాటకులను ఆకర్షించేందుకు స్పీడ్ బోటు రైడింగ్, గుడిసె రాట్నం (గ్రామీణ క్రీడ)ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఐటీడీఏ పార్కును పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట జేఈ జి.తిరుపతిరావు, ఐటీడీఏ అధికారులు, తదితరులున్నారు.