Share News

Specialists are coming ప్రత్యేకాధికారులు వస్తున్నారు

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:07 AM

Specialists are coming విజయనగరం నగరపాలక సంస్థతో పాటు రెండు మునిసిపాల్టీలు, నగర పంచాయతీకి ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విజయనగరం నగరపాలక సంస్థకు ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి, బొబ్బిలి మునిసిపాల్టీకి ఆర్డీవో రామ్మోహనరావు, నెల్లిమర్ల నగర పంచాయతీకి విజయనగరం ఆర్డీవో వెంకటేశ్వరావును ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Specialists are coming ప్రత్యేకాధికారులు వస్తున్నారు

ప్రత్యేకాధికారులు వస్తున్నారు

రెండు మునిసిపాల్టీలకు.. నగర పంచాయతీకి నియామకం

విజయనగరం కార్పొరేషన్‌కు కలెక్టర్‌

ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు ప్రారంభం

విజయనగరం, మార్చి 10(ఆంధ్రజ్యోతి):

విజయనగరం నగరపాలక సంస్థతో పాటు రెండు మునిసిపాల్టీలు, నగర పంచాయతీకి ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విజయనగరం నగరపాలక సంస్థకు ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి, బొబ్బిలి మునిసిపాల్టీకి ఆర్డీవో రామ్మోహనరావు, నెల్లిమర్ల నగర పంచాయతీకి విజయనగరం ఆర్డీవో వెంకటేశ్వరావును ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2021లో మునిసిపల్‌ ఎన్నికలు జరిగాయి. పాలకవర్గాల గడువు ఈ నెల 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకాధికా రులను నియమించింది. వీరు ఆరు నెలల పాటు ప్రత్యేకాధికారులుగా కొనసాగనున్నారు.

మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. ముందుగా మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తారా? లేకుంటే పంచాయతీలకా? అన్నది తెలియాల్సి ఉంది. పంచాయతీల పాలకవర్గం గడువు ఏప్రిల్‌ 2తో ముగియనుంది. దీంతో పంచాయతీలకు సైతం ప్రత్యేకాధికారులు రానున్నారు. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటికే సన్నద్ధంగా ఉండాలని కూటమి పార్టీల శ్రేణులకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ప్రస్తుతం ఆ కమిషన్‌ అధ్యయనం చేస్తోంది. 45 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. అటు తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభంకానున్నాయి.

- జిల్లాలో 777 పంచాయతీలు ఉన్నాయి. విజయనగరం నగరపాలక సంస్థ, బొబ్బిలి, రాజాం మునిసిపాల్టీలు, నెల్లిమర్ల నగర పంచాయతీతో పాటు 27 మండల పరిషత్‌లు, జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటన్నింటికీ ఎన్నికల సమయం సమీపిస్తోంది. తాజాగా మునిసిపాల్టీలకు ప్రత్యేకాధికా రులు రావడంతో ఇక స్థానిక సంస్థల నగరా మొదలైనట్టే. ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్‌ రానుంది.

-----------------

Updated Date - Mar 11 , 2026 | 12:08 AM