ప్రత్యేక అవసరాల పిల్లలపై శ్రద్ధ అవసరం
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:16 AM
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను అత్యంత శ్రద్ధతో చూసుకోవాల్సిన అందరిపై ఉందని కలెక్టర్ రామసుంద ర్‌రెడ్డి అన్నారు.
కలెక్టర్ రామసుందర్‌రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, జూన్ 9(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను అత్యంత శ్రద్ధతో చూసుకోవాల్సిన అందరిపై ఉందని కలెక్టర్ రామసుంద ర్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ ఆడిటో రియంలో పాఠశాల సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉచితంగా సహాయ పరి కరాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజుతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అవసరమైన విద్య, వైద్య పునరావాస సహాయాన్ని అందించేం దుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగి, తమ కలలను సాకారం చేసుకోలన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థు ల సంక్షేమ కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమా లను అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమం లో డీఈవో మాణిక్యంనాయుడు, జిల్లా విభిన్న ప్రతిభావంతులు శాఖ ఏడీ చంద్రిక తదితరులు పాల్గొన్నారు.