Share News

ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:19 AM

ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని డీఎంహెచ్‌వో ఎస్‌.జీవన రాణి తెలిపారు.

ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు

విజయనగరం రింగురోడ్డు, సెప్టెంబరు 25(ఆం ధ్రజ్యోతి): ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని డీఎంహెచ్‌వో ఎస్‌.జీవన రాణి తెలిపారు. సేవా సంకల్ప్‌ అభియాన్‌-2026లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివా రం మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. సందర్భంగా ఏర్పా టుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ శిబి రంలో జనరల్‌ సర్జరీ, ప్రసూతి, చర్మ వ్యాధులు, మాన సిక, ఆయుష్‌, క్షయ, నేత్ర విభాగ సంబంధిత విభా గాలతో సహా, 11 రకాల విభాగాలకు చెందిన వైద్యు లు రోగులను పరిరక్షించి అవసరమైన వైద్య సేవలు అందించారని తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.అల్లు పద్మజ మాట్లాడుతూ ఒక్క రోజులోనే వైద్య పరీక్షలు, చికిత్స, డి-ఆడిక్షన్‌ కౌన్సిలింగు, ఐసీటీసీ, టెలి -మానస్‌, రెఫరల్‌ సేవలను ఒకే వేదికపై అందేలా ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే రోగులకు ఉచి తంగా రక్త పరీక్షలు ఎక్సరే, ఎంఆర్‌ఐ స్కాన్‌తో పాటు మందులను పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్ర మంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డా.దేవీ మాధవి, డీసీహెచ్‌ఎస్‌ డా.పద్మశ్రీరాణి, డీఎల్‌ఏటీవో డా.కె.రాణి, ఎన్టీఆర్‌ ఆరోగ్యసేవల జిల్లా కన్వీనర్‌ ఎ.సా యిరామ్‌, వైద్యాధికారులు, ఐసీడీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2026 | 12:19 AM