బెన్నరాయి జలపాతం అభివృద్థికి ప్రత్యేక చర్యలు
ABN , Publish Date - Nov 13 , 2026 | 12:19 AM
సీతంపేట ఏజెన్సీలోని బెన్నరాయి జలపాతం అభివృద్థికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
- కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
-సీతంపేట ఏజెన్సీలో సవారి ఎకో బైక్ ర్యాలీ
సీతంపేట, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలోని బెన్నరాయి జలపాతం అభివృద్థికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. గురువా రం సీతంపేట మన్యంలో ఆయన పర్యటించా రు. పర్యాటకప్రాంతాల అభివృద్ధిలో భాగంగా మన్యం సవారి ఎకో బైక్ ర్యాలీ నిర్వహించా రు. స్థానిక ఎన్టీఆర్ అడ్వంచర్ పార్క్ నుంచి గిరిశిఖర ప్రాంతంలో ఉన్న బెనరాయి జల పాతం వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ జరిగింది. కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్, అధి కారులు కలిసి బైక్ ర్యాలీ చేట్టారు. బెన్నరా యి జలపాతాన్ని సందర్శించిన కలెక్టర్ అక్క డ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కు ఎంతో అనుకూలంగా ఉందని, రాత్రి సమయంలో క్యాంపింగ్ టెంట్లలో కూడా స్టే చేయవచ్చునని అన్నారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పి స్తామని తెలిపారు. ముందుగా బెనరాయి గ్రామస్థులతో ముచ్చటించిన కలెక్టర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ స్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి ఫొటో లు దిగారు. త్వరలోనే ఈ ప్రాంతాన్ని మరిం త పర్యాటక ప్రాచుర్యంలోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ బైక్ ర్యాలీలో పీహెచ్‌వో ఎస్‌వీ గణేష్, ఇన్‌చార్జి తహసీల్దార్ మల్లేశ్వ రావు, ఎస్‌ఐ అమ్మన్నరావు, సీస్‌డీటీ శ్రీవిద్య, ఐటీడీఏ ఉద్యోగులు పాల్గొన్నారు.