Share News

ఓటు హక్కుకు ప్రత్యేక కార్యాచరణ

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:10 PM

యువత ఓటు హక్కు పొందేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు జిల్లా ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ ఆర్‌.గోపాలకృష్ణ అన్నారు. భోగా పురంలో శనివారం ఆయన పర్యటించారు.

ఓటు హక్కుకు ప్రత్యేక కార్యాచరణ
బీఎల్వోతో మాట్లాడుతున్నగోపాలకృష్ణ

- జిల్లాలో 82వేల మంది యువత ఓటర్లగా చేరాల్సి ఉంది

-ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ గోపాలకృష్ణ

భోగాపురం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): యువత ఓటు హక్కు పొందేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు జిల్లా ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ ఆర్‌.గోపాలకృష్ణ అన్నారు. భోగా పురంలో శనివారం ఆయన పర్యటించారు. జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల, బొల్లివీధి ప్రాథమిక పాఠశాలలోని పో లింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 18 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్న 82వేల మందికి పైగా కొత్తగా ఓటర్లగా నమోదు కావల్సి ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరంతా ఓటు హక్కు పొం దేందుకు కళాశాలల్లో అవగాహన సదస్సులు, ఓటర్‌ క్లబ్స్‌, ర్యాలీలు, శని, ఆదివారాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అక్టోబరు 3లోగా ఎక్కువ మందిని కొత్త ఓటర్లగా చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పామన్నారు. అక్షర దోషా లు, ఇంటిపేర్లలో తేడాలు, చిన్నచిన్న తప్పులు ఉన్న లక్షా 23వేల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చామన్నారు. ఇప్ప టికే 45శాతం నోటీసులపై విచారణ చేశామని, ఇంకా 55 శాతం చేపట్టాల్సి ఉందన్నారు. సర్‌ పొగ్రాం అక్టోబరు 3కు జరుగుతుందని, నోటీసులకు స్పందించని వాటిపై ఏమి చేయాలో తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి ఆసయ్య, తహసీల్దార్‌ హేమంత్‌ కుమార్‌, ఎంపీడీవో, డీడీ స్వరూ పరాణి, సీఐ కె.దుర్గాప్రసాదరావు, ఆర్‌ఐ వేణుగోపాలకృష్ణ, నాయకులు బొల్లునాథ్‌, పసుపులేటి లోకేశ్‌ పాల్గొన్నారు.

పిల్లలకు ఇలాంటి ఆహారం పెడతారా?

భోగాపురం బొల్లివీధి ప్రాథమిక పాఠశాలలో నిర్వహి స్తున్న అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లా ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌, హెల్త్‌,మెడికల్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ జాయింట్‌ సెక్రటరీ ఆర్‌.గోపాలకృష్ణ పరిశీలించారు. కేంద్రంలో ఐ దుగురు చిన్నారులు మాత్రమే ఉండడం గమనించారు. ఆ సమయంలో అంగన్‌వాడీ కార్యకర్త లేకపోవడంపై ఆరా తీశారు. ఆమె ఎక్కడకి వెళ్లారు.. అధికారులు వస్తున్నప్పుడు కూడా కేంద్రంలో లేకపోవడమేమిటని ఆయాని ప్రశ్నించారు. మీటింగ్‌కు వెళ్లిందని ఆయా సమాధానం ఇచ్చారు. పిల్లల కోసం చేసిన ఎగ్‌ రైస్‌ చల్లగా అయిపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నారులకు ఇలాంటి ఆహారం పెడతారా అని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న అంగన్‌వాడీ సూపర్‌ వైజర్‌ సత్యవేణి అక్కడకి చేరుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రం బాగుండేలా చూసుకోవాలని, చిన్నారులకు వేడి ఆహార పదార్ధాలు అందించాలని సూచించారు. పాఠశాలల స్థలాల ఆక్రమణకు గురికా కుండా చూడాలని తహసీల్దార్‌ హేమంత్‌ కుమార్‌కు సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2026 | 11:10 PM