గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Sep 13 , 2026 | 12:02 AM
గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ చెప్పారు.
సీతంపేట, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ చెప్పారు. సీతం పేట ఏరియా ఆసుపత్రిలో పీఎం అభిమ్ పథకం కింద రూ.125 లక్షలతో ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌రేటరీ (ఐపీహెచ్‌ఎల్)ని కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి జేపి నడ్డా శనివారం విజయవాడ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈకార్యక్రమంలో భాగంగా సీతంపేట ఏరియా ఆసుప త్రిలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష ఐపీహెచ్‌ఎల్ ల్యాబ్‌ను ప్రారం భించి మాట్లాడారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ నాగభూషణం, డిప్యూటీ డీఎంహెచ్‌వో కె.విజయపార్వతీ, ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్ బి.శ్రీని వాసరావు, సర్జన్ డీవీశ్రీనివాస్, ఆర్ధోఫెడిక్ వైద్యులు కె.రాజేష్, కూటమి నాయ కులు పవన్, రవణమ్మ, కోటి పాల్గొన్నారు.