Shambara Jathara శంబర జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:03 AM
Special Focus on Shambara Jathara Arrangements శంబర జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి.. పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.
పార్వతీపురం, జనవరి 5(ఆంధ్రజ్యోతి): శంబర జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి.. పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎక్కడా ఎటువంటి సమస్య తలెత్తకుండా శంబర జాతర ఏర్పాట్లు చేయాలి. గత 13 రోజుల్లో జిల్లాలో ఒక్క మలేరియా కేసు కూడా నమోదుకాకపోవడం శుభపరిణామం. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు గ్రామస్థాయిలో పారిశుధ్యం మెరుగుకు పటిష్ట చర్యలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైంది. ఉద్యోగుల గ్రీవెన్స్‌లో వచ్చిన వినతులను శతశాతం పరిష్కరిస్తున్నాం. ప్రతి మండలానికి కార్పొరేట్ స్థాయి పాఠశాల ఏర్పాటు చేయాలి. ఎక్కడైనా విద్యార్థులకు చర్మవ్యాధులు ఉన్నట్టు గుర్తిస్తే.. దానిపై అవగాహన కల్పించాలి. గణతంత్ర దినోత్సవంలో శకటాల ప్రదర్శన ప్రత్యేకంగా ఉండాలి. ఆయా శాఖలు అందిస్తున్న సేవలు ప్రజలకు అర్థమయ్యేలా చర్యలు తీసుకోవాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. రోడ్లుపై చెత్తను వేసేవారికి అవగాహన కల్పించాలి.’ అని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో హేమలత, సబ్ కలెక్టర్లు వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తదితరులున్నారు.
అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి
జిల్లా అభివృద్ధే లక్ష్యంగా విధులు నిర్వహించాలని, అంకితభావంతో ప్రజలకు సేవలు అందిం చాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ‘ సీఎంవో కార్యాలయం నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో జిల్లా ముందంజలో ఉంది. పెండింగ్‌లో ఉన్న మరో ఆరు అర్జీలపై దృష్టి సారించాలి. జాతీయ స్థాయిలో నీటి లభ్యతలోనూ మన్యం ప్రథమ స్థానంలో ఉంది. విద్యా ర్థులకు చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించాలి. అన్ని రంగాల్లో ముందుండేలా చర్యలు తీసుకోవాలి.’ అని కలెక్టర్ తెలిపారు.